కెనడాలో టార్గెట్‌ కిల్లింగ్‌.. | Indian-origin couple killed in targeted shooting outside Canada Walmart | Sakshi
Sakshi News home page

కెనడాలో టార్గెట్‌ కిల్లింగ్‌..

Nov 22 2026 5:59 AM | Updated on Nov 22 2026 5:59 AM

Indian-origin couple killed in targeted shooting outside Canada Walmart

కాల్పుల్లో భారత సంతతి జంట మృతి

బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రేలో ఘటన

సర్రే: కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియాలో భారత సంతతికి చెందిన ఓ జంట గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. సర్రే నగరంలోని వాల్‌మార్ట్‌ స్టోర్‌ పార్కింగ్‌ ప్లేస్‌లో ఈ నెల 15వ తేదీ రాత్రి ఘటన చోటుచేసుకుంది. నేరగాళ్ల ముఠా యే ఈ దారుణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. మృతులను గగన్‌ప్రీత్‌ (గ్యారీ) రెహాల్‌(23), సుఖ్‌జీత్‌ కౌర్‌ (24)గా గుర్తించారు. ఇద్దరూ నగరంలోని డెల్టా టౌన్‌షిప్‌ ప్రాంతంలో నివసిస్తుంటారని పోలీసులు తెలిపారు. 

రాత్రి 10.38 గంటల సమయంలో సమాచారం అందడంతో ఘటన ప్రాంతానికి చేరుకుని, తుపాకీ తూటాలతో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించామని, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని వివరించారు. ‘మృతుల్లో రెహల్‌కు అక్రమ ఆయుధాలకు సంబంధించిన కేసులతో సంబంధముంది. కౌర్‌ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. పథకం ప్రకారమే ఇద్దరిపైనా కాల్పులు జరిపినట్లుగా అనుమానిస్తున్నాం. 

ఘటన జరిగిన పావు గంట తర్వాత అక్కడికి సమీపంలోనే ఓ కారు మంటల్లో తగులబడిపోయిందని గుర్తించాం. నిందితులు లేదా అనుమానితులే కారుకు నిప్పుపెట్టి ఉంటారు’అని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలిసిన వారు విచారణలో తమకు సహకరించాలని కోరారు. కాగా, మృతుల కుటుంబాలు ఈ ఘటనతో తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. 

కేవలం కొద్ది నిమిషాల ముందే తమ కుమారుడు ఇంటి నుంచి బయటకు వచ్చాడని రెహాల్‌ తండ్రి తెలిపారు. కౌర్‌ తమ కుమారుడి గర్ల్‌ఫ్రెండ్‌ అని అన్నారు. కెనడాలో ట్రక్కు డ్రైవర్‌గా పనిచేసుకుంటున్నా. నా కుమారుడిని ఎవరు, ఎందుకు పొట్టనబెట్టుకున్నారో తెలియడం లేదు’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కాల్పుల ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement