20 ఏళ్ల క్రితమే ఆ మాజీ సీఈఓ అసభ్య వైఖరి వెలుగులోకి | Nvidia employees complained about Jensen Huang's behavior years ago | Sakshi
Sakshi News home page

20 ఏళ్ల క్రితమే ఆ మాజీ సీఈఓ అసభ్య వైఖరి వెలుగులోకి

Nov 21 2026 5:47 PM | Updated on Nov 21 2026 5:47 PM

Nvidia employees complained about Jensen Huang's behavior years ago

ఎన్విడియా కార్పొరేషన్ (Nvidia) మాజీ సీఈఓ   63 ఏళ్ల  జెన్సన్ హువాంగ్‌కు సంబంధించిన  మరో సంచలన విషయం  తాజాగా వెలుగులోకి వచ్చింది. లైంగిక ఆరోపణలు, గూఢచర్యం ఆరోపణలతో పదవికి నుంచి తప్పకున్న  జెన్సన్‌పై  సుమారు 20 ఏళ్ల క్రితమే  సంస్థలోని ఇద్దరు ఉద్యోగులు తమను బెదిరించాడని, లైంగికంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని చేసిన ఫిర్యాదు కలకలం రేపుతోంది.

కాలిఫోర్నియాలో దాఖలైన ఒక దావాలోని ఆరోపణల ప్రకారం, ఆయన తన సిబ్బందితో ప్రవర్తించిన తీరుపై ఫిర్యాదు చేశారు. 2007లో బెదరింపులు, లైంగికంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ఇద్దరు ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఎన్విడియా నియమించుకున్న మొట్టమొదటి ఇన్-హౌస్ లాయర్ స్టీఫెన్ పెటిగ్రూ ప్రకారం, హువాంగ్ ఉద్యోగులను నిత్యం దుర్భాషలాడటం, బెదిరించడం తాను గమనించానని చెప్పారు.  అతని ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేసినందుకే తనను తొలగించారని పెటిగ్రూ ఆరోపించారు. మరోవైపు పనితీరు లోపాల వల్లే ఆయనను తొలగించినట్లు కంపెనీ పేర్కొంది.

‘‘తీవ్రమైన శారీరక హాని కలిగిస్తానని బెదిరించేవారు.  లైంగిక చర్యను ప్రదర్శిస్తున్నట్లుగా నడుమును కదిలిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసేవారు" అని వయస్సు వివక్ష , అక్రమ తొలగింపు ఆరోపణలతో పెటిగ్రూ తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. కంపెనీ పత్రాలను తిరిగి ఇవ్వాలని కోరుతూ ఎన్విడియా ప్రతిదావా వేసిన ఈ వివాదం,  2009 డిసెంబర్‌లో ఒక రహస్య ఒప్పందం (confidential settlement) ద్వారా పరిష్కారమైంది.

మరో ఉద్యోగి, మానవ  హెచ్‌ఆర్‌ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ విన్‌స్టన్, 2005లో వివక్షత ఫిర్యాదు దాఖలు చేశారు. ఉద్యోగుల పట్ల హువాంగ్ దుర్వినియోగ ప్రవర్తన, ముఖ్యంగా లైంగిక వేధింపుల ప్రవర్తనపై అభ్యంతరం తెలిపినందుకే తనను తొలగించారని ఆయన ఆరోపించినట్లు పెటిగ్రూ కోర్టు పత్రాల ద్వారా తెలుస్తోంది.

మూడు దశాబ్దాలకు పైగా తాను నిర్వహించిన పదవిలోకి తిరిగి రావడానికి అనుమతించాలని  హువాంగ్‌  బోర్డుకు విజ్ఞప్తి చేస్తున్న తరుణంలో, దశాబ్దాల క్రితం నాటి ఆయన ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక డైరెక్ట్ రిపోర్ట్ (తన కింద పనిచేసే ఉద్యోగి) ,  అమెరికా న్యాయ శాఖ దర్యాప్తు చేస్తున్న ఒక అనుమానిత చైనా గూఢచారితో సహా పలువురితో ఆయనకు ఉన్న సంబంధాలు బయటపడటంతో ఆయన ఈ నెల ప్రారంభంలో రాజీనామా చేశారు. తమ నుండి ఉత్తమ పనితీరును రాబట్టడానికి తనతో సన్నిహితంగా పనిచేసే వారిని తాను "హింసిస్తాను" (torturing) అని హువాంగ్ స్వయంగా అంగీకరించారు. సీఈఓగా ఉన్న సమయంలో హువాంగ్ కింది స్థాయి ఉద్యోగులను అవమానించారనే వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి.

మరోవైపు  హువాంగ్ ప్రతినిధి  ఈ తప్పుడు ఆరోపణలు 20 ఏళ్ల క్రితం నాటివి, తీసేసిన  ఇద్దరు ఉద్యోగులు చేసినవి అంటూ కొట్టిపారేశారు.  గత వారం రోజులుగా జెన్సన్‌కు మద్దతు తెలుపుతూ, ఆయన్ను వెనక్కు పిలవాలని డిమాండ్‌ చేస్తున్న  వేలాది మంది ఉద్యోగుల స్పందనే దీనికి నిదర్శనమని వాదించారు.  ఎన్విడియా ప్రతినిధులు వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

పెటిగ్రూ , విన్‌స్టన్ ఇద్దరూ మరణించా. వారి తరపున వాదించిన న్యాయవాదులు, కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించడానికి అందుబాటులో లేరు. గతంలో మూడు పెద్ద న్యాయ సంస్థలలో పనిచేసిన మాజీ ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజనీర్ అయిన పెటిగ్రూ, 1999 ప్రారంభంలో కంపెనీ పబ్లిక్‌కు వెళ్ళిన తర్వాత సెప్టెంబర్ 1999లో ఎన్విడియాలో చేరారు.  2006 జూన్‌లో  ఉద్వాసనకు గురయ్యారు. 2004, సెప్టెంబర్‌లో ఎన్విడియాలో  చేరిన  విన్‌స్టన్ కేవలం నాలుగు వారాలు మాత్రమే కంపెనీలో పనిచేశారు.ఆ తర్వాత విన్‌స్టన్ కార్పొరేట్ విజిల్‌బ్లోయర్‌గా పేరు తెచ్చుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement