ఒకే రాత్రి 868 సార్లు పార్కింగ్‌కు ట్రై చేసిన కారు | Electric Car Tries To Park Itself 868 Times In China | Sakshi
Sakshi News home page

ఒకే రాత్రి 868 సార్లు పార్కింగ్‌కు ట్రై చేసిన కారు

Nov 21 2026 3:16 PM | Updated on Nov 21 2026 3:42 PM

Electric Car Tries To Park Itself 868 Times In China

ఓ డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ కారు రాత్రంతా పార్కింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఏకంగా 868 సార్లు అదే ప్రక్రియను రిపీట్ చేసింది. చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌లో ఓ అండర్‌గ్రౌండ్ పార్కింగ్‌లో తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీలో కారు ముందుకు, వెనక్కి కదులుతూ పార్కింగ్ చేసేందుకు పదేపదే ప్రయత్నించడం కనిపించింది. దానికి సంబంధించిన శబ్దాలు విన్న సెక్యూరిటీ గార్డు అక్కడికి వెళ్లి చూస్తే.. కారులో ఎవరూ లేరు.

కారు యజమాని ఈ విషయంపై స్పందిస్తూ.. వాహనం ఆటోమేటిక్ పార్కింగ్ ఫీచర్ రాత్రంతా 868 సార్లు యాక్టివేట్ అయిందని, దాని వల్లనే ఇలా జరిగి ఉండొచ్చని, దాంతో చివరకు మరో వాహనం పక్కన ఆగిపోయిందని తెలిపారు.

అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు కారణం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు. దీనిపై కొందరు కారులోని సాఫ్ట్‌వేర్ లోపం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మరికొందరు యజమాని యాప్ ద్వారా రిమోట్ పార్కింగ్ ఫీచర్‌ను పదేపదే ఉపయోగించి ఉండొచ్చని అంటున్నారు. కానీ వీడియో ఆధారంగా కచ్చితమైన కారణాన్ని మాత్రం నిర్ధారించలేము.

జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. ‘‘కారుకు OCD వచ్చేసింది.. ఇక మనుషులు ఎక్కడికి పోవాలి?’’, ‘‘నా క్లీనింగ్ రోబో కూడా ఇలాగే చేస్తుంది’’ అంటూ కామెంట్లు పెట్టారు. మరికొందరు ‘‘కారు GTA గేమ్‌లోకి వెళ్లినట్లుంది’’ అని, ‘‘డ్రైవర్‌లెస్ వాహనాలు మనకు అవసరమా?’’ అంటూ సరదాగా స్పందించారు.

ఇదీ చదవండి: చైనాపై మేమూ గూఢచర్యం చేస్తున్నాం: ట్రంప్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement