డ్రైవర్ లేకుండా.. 868 సార్లు తిరిగిన కారు! | China EV Tries To Park Itself 800 Times Overnight | Sakshi
Sakshi News home page

డ్రైవర్ లేకుండా.. 868 సార్లు తిరిగిన కారు!

Nov 21 2026 12:28 PM | Updated on Nov 21 2026 12:37 PM

China EV Tries To Park Itself 800 Times Overnight

చైనాలో ఓ ఎలక్ట్రిక్ కారు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. సాధారణంగా కారును పార్కింగ్ చేయాలంటే డ్రైవర్ ఉండాలి. కానీ.. చైనాలో ఓ ఎలక్ట్రిక్ కారు మాత్రం డ్రైవర్ లేకుండానే రాత్రంతా పార్కింగ్ చేసేందుకు ప్రయత్నించింది. అదీ ఒకటి రెండుసార్లు కాదు.. ఏకంగా 868 సార్లు పార్కింగ్ ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది.

ఓ అపార్ట్‌మెంట్ బేస్‌మెంట్ పార్కింగ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కారులో ఎవరూ లేకపోయినా అది ముందుకు, వెనక్కి కదులుతూ పార్కింగ్ కోసం ప్రయత్నించడం చూసి అక్కడి సెక్యూరిటీ గార్డు కూడా ఆశ్చర్యపోయాడు. తర్వాత కారు యజమాని వెహికల్ రికార్డులను పరిశీలించగా, ఆటోమేటిక్ పార్కింగ్ ఫీచర్ ఏకంగా 868 సార్లు యాక్టివేట్ అయినట్లు గుర్తించాడు.

ఇదొక్కటే కాదు.. ఇలాంటి ఘటనలకు సంబంధించిన మరికొన్ని వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా అవతార్ 06, అవతార్ 12 కార్లు తెల్లవారుజామున సుమారు 6 గంటల సమయంలో పక్కపక్కనే పార్కింగ్ చేసేందుకు ప్రయత్నించడం మరో విశేషం. రెండు కార్లు ఒకే విధంగా ముందుకు, వెనక్కి కదులుతూ పార్కింగ్ ప్రక్రియను కొనసాగించాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు డ్రైవర్ లేకుండానే కార్లు ఇలా తిరగడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: బిగ్ రిలీఫ్.. బంగారం కొనేందుకు మంచి తరుణం!

అయితే.. ఈ కార్లు ఎందుకు పదేపదే పార్కింగ్ ప్రయత్నాలు చేశాయనే దానిపై పలు కారణాలు వినిపిస్తున్నాయి. కొందరు యజమానులు మొబైల్ యాప్ ద్వారా కార్లను పార్కింగ్ స్థలం నుంచి బయటకు తీసి మళ్లీ పార్క్ చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చని భావిస్తున్నారు. అలాగే పార్కింగ్ ప్రాంతంలో సరైన వెలుతురు లేకపోవడం, పార్కింగ్ లైన్లు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల కూడా కార్లు పదేపదే ప్రయత్నించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement