ఉద్యోగులకు కావ్య మారన్ అదిరిపోయే గిఫ్ట్! | Kavya Maran Gifts Gold Rings to Employees Ahead of Wedding Reception | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు కావ్య మారన్ అదిరిపోయే గిఫ్ట్!

Nov 21 2026 11:27 AM | Updated on Nov 21 2026 11:37 AM

Kavya Maran Gifts Gold Rings to Employees Ahead of Wedding Reception

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కో-ఓనర్ కావ్య మారన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌తో ఆమె వివాహ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో.. సన్ గ్రూప్ ఉద్యోగులకు ఆమె ఇచ్చిన బహుమతులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఉద్యోగులకు గోల్డ్ రింగ్ గిఫ్ట్
కావ్య మారన్ తన పెళ్లి వేడుకల సందర్భంగా ఉద్యోగులకు బంగారు ఉంగరాలను గిఫ్ట్ ఇచ్చినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. ఉద్యోగులకు అందించిన గిఫ్ట్ బాక్సుల్లో పెళ్లి ఆహ్వాన పత్రిక, చాక్లెట్లు, బంగారు ఉంగరాలు ఉన్నాయి. ఒక ఉద్యోగి మాట్లాడుతూ.. తమకు బంగారు నాణేలు ఇస్తారని అనుకున్నామని, కానీ ఏకంగా బంగారు ఉంగరాలు ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ గిఫ్ట్ బాక్సుల్లో నవంబర్ 25న నిర్వహించనున్న లంచ్ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక కూడా ఉంది. అయితే.. ఇది సన్ గ్రూప్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమమా? అనేది ఇంకా స్పష్టత లేదు. ఒక్కో ఉంగరం ఎంత బరువు ఉంటుంది? దాని విలువ ఎంత? మొత్తం ఎంతమంది ఉద్యోగులకు ఈ బహుమతులు అందించారు? అనే వివరాలు కూడా బయటకు రాలేదు.

అయినప్పటికీ.. ఉద్యోగులకు కావ్య మారన్ ఇచ్చిన ఈ గిఫ్ట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ సంతోషాన్ని ఉద్యోగులతో కూడా పంచుకోవడం మంచి విషయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కావ్య.. అనిరుధ్ పెళ్లి
ఇక కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ వివాహం నవంబర్ 11న గ్రీస్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. కాగా ఈ రోజు (నవంబర్ 21) చెన్నైలో వీరి గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి సినిమా, క్రికెట్, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. మాజీ దక్షిణాఫ్రికా క్రికెటర్ డేల్ స్టెయిన్ ఇప్పటికే తన కుటుంబంతో కలిసి చెన్నైకి చేరుకున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: బిగ్ రిలీఫ్.. బంగారం కొనేందుకు మంచి తరుణం!

మరోవైపు షారుఖ్ ఖాన్, కమల్ హాసన్, అల్లు అర్జున్, అజిత్ కుమార్ వంటి ప్రముఖులకు కూడా ఈ రిసెప్షన్‌కు సంబంధించిన ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. అయితే.. వీరిలో ఎవరు హాజరవుతారనే విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఐపీఎల్ ద్వారా క్రికెట్ అభిమానులకు దగ్గరైన కావ్య మారన్, ఇప్పుడు తన వివాహ వేడుకలతో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement