స్ప్లెండర్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు! | Hero Splendor Plus Gets Price Hike Of Up To Rs 3086 | Sakshi
Sakshi News home page

స్ప్లెండర్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు!

Nov 21 2026 8:14 AM | Updated on Nov 21 2026 8:19 AM

Hero Splendor Plus Gets Price Hike Of Up To Rs 3086

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. తన అత్యంత ప్రజాదరణ పొందిన స్ప్లెండర్ ప్లస్ బైక్ రేట్లను పెంచింది. వివిధ వేరియంట్లపై రూ.1,135 నుంచి రూ.3,086 వరకు ధరలు పెరిగాయి.

కొత్త ధరలు
ప్రస్తుతం హీరో స్ప్లెండర్ ప్లస్ నాలుగు ప్రధాన వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేస్ డ్రమ్ వేరియంట్ ధర గతంలో రూ.77,777 ఉండగా, ఇప్పుడు రూ.78,912కి చేరింది. i3S వేరియంట్ ధర రూ.78,910 నుంచి రూ.80,045కి పెరిగింది. స్పెషల్ ఎడిషన్ ధర రూ.78,580 నుంచి రూ.81,666కి చేరింది. 125 మిలియన్ ఎడిషన్ ధర రూ.80,531 నుంచి రూ.81,666కి పెరిగింది. స్పెషల్ ఎడిషన్‌లో కొత్తగా మ్యాట్ గ్రే, మ్యాట్ వెర్నియర్ గ్రే, క్యాండీ బ్లేజింగ్ రెడ్ అనే మూడు రంగులను అందిస్తోంది.

ఫీచర్స్ ఇలా..
ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. స్ప్లెండర్ ప్లస్ XTEC వేరియంట్‌లో డ్రమ్ బ్రేక్ మోడల్ ధర రూ.82,418గా, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మోడల్ ధర రూ.85,461గా ఉంది. ఈ వేరియంట్‌లో అనలాగ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్స్, రియల్ టైమ్ మైలేజ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. మరోవైపు XTEC 2.0 వేరియంట్ ధర రూ.84,549గా నిర్ణయించారు. ఇందులో హాలోజన్ హెడ్‌ల్యాంప్ స్థానంలో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, హజార్డ్ లైట్ ఫంక్షన్ అందించారు. అయితే.. XTEC 2.0లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఆప్షన్ లేదు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ (Flex) వేరియంట్ ధర కూడా పెరిగింది. గతంలో రూ.82,710గా ఉన్న ఈ బైక్ ధర ఇప్పుడు రూ.84,042కి చేరింది. ఈ వేరియంట్ ప్రత్యేకత ఏమిటంటే.. E20 నుంచి E85 వరకు ఇథనాల్ కలిపిన ఇంధనంతో నడిచే సామర్థ్యం కలిగి ఉండటం. E85 ఇంధనంతో నడిచినప్పుడు 8.6 హార్స్ పవర్, 8.3 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే E20 ఇంధనంతో 8.02 హార్స్ పవర్, 8.05 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. అయితే హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ బైక్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దీని ధర రూ.72,792గానే కొనసాగుతోంది.

ఇదీ చదవండి: ఇన్సూరెన్స్ లేకుంటే.. రూ.10 వేలు ఫైన్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement