Canada: వాహనాల చోరీ.. ఇద్దరు పంజాబీ యువకులు అరెస్ట్! | Project Cadetta 2 Punjabi youths among 12 arrested in Canada | Sakshi
Sakshi News home page

Canada: వాహనాల చోరీ.. ఇద్దరు పంజాబీ యువకులు అరెస్ట్!

Nov 17 2026 9:25 AM | Updated on Nov 17 2026 9:25 AM

Project Cadetta 2 Punjabi youths among 12 arrested in Canada

ఒట్టావా: కెనడాలో అంతర్జాతీయ వాహన దొంగతనాల ముఠాపై పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ వ్యవహారంలో పంజాబ్‌కు చెందిన ఇద్దరు యువకులు సహా మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.37 కోట్ల విలువైన 96 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులపై మొత్తం 231 అభియోగాలు నమోదయ్యాయి.

గ్రేటర్ టొరంటో ప్రాంతంలో సాగుతున్న ఈ అక్రమ రవాణా వ్యవహారాన్ని పోలీసులు ‘ప్రాజెక్ట్ కడెట్టా’ పేరుతో దర్యాప్తు చేశారు. 2026 మార్చిలో కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ (సీబీఎస్‌ఏ) సహకారంతో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. బ్రాంప్టన్‌లోని ఓ గిడ్డంగిని దొంగిలించిన వాహనాలను దాచే కేంద్రంగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. దొంగిలించిన ఖరీదైన కార్లు, లగ్జరీ ఎస్‌యూవీలు, పికప్ ట్రక్కుల గుర్తింపు నంబర్లను మార్చి షిప్పింగ్ కంటైనర్లలో దాచేవారు. అక్కడి నుంచి కెనడా పోర్టుల మీదుగా పశ్చిమ ఆఫ్రికా దేశాలకు తరలించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.

సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మొదటి వారంలో నిర్వహించిన సోదాల్లో 96 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన 12 మందిలో తొమ్మిది మందిపై అభియోగాలు నమోదు చేసి కోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. మిగిలిన ముగ్గురిని బెయిల్ విచారణ అనంతరం విడుదల చేశారు. ఈ నెట్‌వర్క్‌లో ఐదుగురు ప్రధాన నిందితులు వాహనాల దొంగతనం, రవాణా, విదేశాలకు ఎగుమతి వ్యవహారాలను నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై క్రిమినల్ విచారణ పూర్తయ్యాక కొందరిపై వలస నిబంధనల ప్రకారం దేశం నుంచి బహిష్కరణ చర్యలు కూడా ఉండవచ్చని అధికారులు తెలిపారు. 

ఇదీ చదవండి: ఇండోనేషియాలో భూకంపం.. 6.6 తీవ్రత నమోదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement