కెనడాలో కాల్పులు : భారత సంతతి జంట మృతి | Indian origin couple killed in targeted shooting outside Canada Walmart | Sakshi
Sakshi News home page

కెనడాలో కాల్పులు : భారత సంతతి జంట మృతి

Nov 21 2026 7:12 PM | Updated on Nov 21 2026 7:12 PM

Indian origin couple killed in targeted shooting outside Canada Walmart

కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఉన్న సర్రే నగరంలో, వాల్‌మార్ట్ స్టోర్ పార్కింగ్ స్థలంలో జరిగిన కాల్పుల్లో  ఇద్దరు భారత సంతతి  జంట ప్రాణాలు  కోల్పోయారు. నవంబర్ 15 రాత్రి ఈ కాల్పుల్లో మరణించిన వారిని గగన్‌ప్రీత్ (గ్యారీ) రెహాల్ (23), సుఖ్‌జీత్ కౌర్ (24)గా గుర్తించారు. వీరు సమీపంలోని డెల్టా ప్రాంతానికి చెందిన దక్షిణాసియా నివాసితులుగా సర్రే పోలీస్ సర్వీస్ ఒక ప్రకటనలో పేర్కొంది. 

 కాల్పుల   తరువాత,  ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది, బాధితులిద్దరినీ ఆసుపత్రికి తరలించగా, కొద్దిసేపటికే వారు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడి అని, వ్యవస్థీకృత నేరాలతో సంబంధం ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ కేసును 'ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్' (IHIT) తన ఆధీనంలోకి తీసుకుంది. రెహాల్‌కు గతంలో ఆయుధాలకు సంబంధించిన నేరాల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులకు తెలుసని, కౌర్‌కు కెనడాలో పరిచయాలు చాలా తక్కువని IHITకి చెందిన సార్జెంట్ ఫ్రెడా ఫాంగ్ తెలిపారు. అంతేకాకుండా, ఈ కాల్పులకు,  ఆ తర్వాత కొద్దిసేపటికే తగులబడిన  వాహనానికి సంబంధం ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడి వెనుక ఎవరున్నారు, ఆ జంటను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు అనే విషయాలను నిర్ధారించడానికి అధికారులు ప్రయత్నిస్తుండగా, ఈ ఆచూకీ లభించడం దర్యాప్తులో కీలకమైంది.

ఇదీ చదవండి : ముంబై పార్క్‌లో జంటపై మైనర్ల అరాచకం, వైరల్‌ వీడియో

తండ్రి ఆవేదన
23 ఏళ్ల యువకుడి తండ్రి, తన కుమారుడు ఈ ఘోర సంఘటన జరగడానికి కేవలం కొన్ని నిమిషాల ముందే ఇంటి నుండి బయలుదేరాడని చెప్పారు. కౌర్ తన కుమారుడి స్నేహితురాలని చెప్పారు.  "ఏం జరుగుతుందో మాకు తెలియడం లేదు, నేను నా కుమారుడిని కోల్పోయాను. నేను ఒక ట్రక్ డ్రైవర్‌ని. నేను కాల్గరీ నుండి తిరిగి వస్తుండగా కాల్పుల గురించి సమాచారం అందింది. ఇప్పుడు నా కుమారుడు ఇక లేడని చెబుతున్నారు. మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్లారో పోలీసులు చెప్పడం లేదు, నేను అతడిని చూడాలనుకుంటున్నాను,"   అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 

ఇదీ చదవండి: పన్నూ హత్యకు కుట్ర : భారతీయుడికి అమెరికా కోర్టు 235 నెలల శిక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement