పన్నూ హత్యకు కుట్ర : భారతీయుడికి అమెరికా కోర్టు 235 నెలల శిక్ష | Indian Man Gets Over 19 Years In US Jail Over Plot To Kill Khalistani Gurpatwant Pannun | Sakshi
Sakshi News home page

పన్నూ హత్యకు కుట్ర : భారతీయుడికి అమెరికా కోర్టు 235 నెలల శిక్ష

Nov 21 2026 6:43 PM | Updated on Nov 21 2026 6:43 PM

 Indian Man Gets Over 19 Years In US Jail Over Plot To Kill Khalistani Gurpatwant Pannun

న్యూయార్క్‌: సిక్కు వేర్పాటువాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూను చంపించేందుకు కుట్ర పన్నిన ఆరోపణలపై భారత సంతతికి చెందిన నిఖిల్‌ గుప్తా(55)కు అమెరికాలోని ఓ కోర్టు 235 నెలల జైలు శిక్ష విధించింది. పన్నూను చంపేందుకు కిరాయి హంతకుడిని పురమాయించినట్లు గుప్తాపై అభియోగాలు నమోదయ్యాయి. 

కిరాయి హంతకుడి ముసుగులో ఉన్న అమెరికా నిఘా విభాగం అధికారికే గుప్తా డబ్బులిచ్చినట్లు రుజువైంది. దీంతో, శుక్రవారం న్యూయార్క్‌ సదరన్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి విక్టొర్‌ మరెర్రో 19 ఏళ్ల 7 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. అంతకుముందు, గుప్తా తాను పాల్పడిన పనికి గాను పన్నూతోపాటు ఆయన వర్గానికి క్షమాపణలు చెబుతున్నానన్నారు. అయితే, తనపై హత్యాయత్నం జరుగుతుందన్న భయంతో నాలుగేళ్లుగా న్యాయవాద వృత్తికి దూరంగా ఉంటున్నట్లు పన్నూ చెప్పారు. తీర్పు సమయంలో కోర్టు వెలుపల పెద్ద సంఖ్యలో పన్నూ మద్దతుదారులు గుమికూడారు.   

ఇదీ చదవండి: ఎయిర్‌హోస్టెస్‌ హత్య కేసులో ట్విస్ట్‌ : రూ. 13 లక్షల సుపారీ ఇచ్చి మరీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement