బంగారు ఉంగరం సాయంతో హత్య కేసు ఛేదన | Woman Molested, dead In Train Coach Gold Ring Helps Solve Case | Sakshi
Sakshi News home page

బంగారు ఉంగరం సాయంతో హత్య కేసు ఛేదన

Nov 21 2026 5:04 PM | Updated on Nov 21 2026 5:12 PM

Woman Molested, dead In Train Coach Gold Ring Helps Solve Case

నాగర్‌కోయిల్‌: తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌ రైల్వే యార్డులో నిలిపి ఉంచిన ఉపయోగంలేని రైలు బోగీలో ఓ 54 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. అయితే ఆ మహిళ వద్ద ఉన్న పాము ఆకారపు బంగారు ఉంగరం ఆధారంగా పోలీసులు ఆమె వివరాలను గుర్తించారు. అంతేకాదు ఈ కేసులో నిందితుడిని దర్యాప్తు ప్రారంభించిన ఆరు గంటల్లోనే అరెస్ట్ చేశారు.

ఈ ఘటన నవంబర్‌ 13 అర్ధరాత్రి చోటుచేసుకున్నట్టు సమాచారం. అయితే ఘటన జరిగిన బోగీని మరో రైలులో వినియోగించేందుకు శుభ్రం చేస్తుండగా మహిళ మృతదేహం బయటపడింది. దాంతో వెంటనే అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె గుర్తింపు తెలియకపోవడంతో ఉంగరంపై ఉన్న హాల్‌మార్క్‌ వివరాలను పరిశీలించారు. దాంతో ఆ వివరాలు గుజరాత్‌కు చెందిన ఓ నగల విక్రేత వద్దకు, అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ రిటైలర్‌ వద్దకు దర్యాప్తును తీసుకెళ్లాయి. దీంతో మహిళ పాన్‌ వివరాలు, మధ్యప్రదేశ్‌లోని చిరునామా లభించాయి. ఆమె గత మూడు నెలలుగా స్వగ్రామం నుంచి కనిపించకుండా పోయినట్లు తెలిసింది.

సీసీటీవీతో నిందితుడి గుర్తింపు
రైల్వే స్టేషన్‌ సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ముగ్గురు అనుమానితులను పరిశీలించిన పోలీసులు.. తెల్లటి దుస్తులు ధరించి బోగీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని గుర్తించారు. విచారణలో అతడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. స్టేషన్‌ పరిసరాల్లో తిరిగే యాచకుడిగా ఉన్న నిందితుడు, గతంలో మహిళను కలిసినట్లు సమాచారం. మహిళను బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

నిందితుడు పారేసిన రక్తపు మరకలున్న చొక్కాను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. ప్రాథమికంగా మహిళ పక్కటెముకలు విరిగినట్లు గుర్తించారు. ఘటనపై రైల్వే డీజీపీ కె. వన్నియ పెరుమాళ్‌ దర్యాప్తు బృందాన్ని, రైల్వే ఎస్పీ ఆదర్శ్‌ పచేరా పనితీరును అభినందించారు.

ఇదీ చదవండి: ఒకే రాత్రి 868 సార్లు పార్కింగ్‌కు ట్రై చేసిన కారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement