సాక్షి, పోలవరం జిల్లా: గంజాయి తరలిస్తున్న కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన పేర్చిన ఇటుకల గోడతోపాటు మరో రెండు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటన ఎటపాకలో చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో కారులో 35 కేజీల గంజాయి బయటపడింది.
ఒడిశా నుంచి తెలంగాణకు గంజాయిని తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి తరలిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఇటుకల గోడను ఢీకొట్టడంతో పాటు మరో రెండు వాహనాలను ఢీకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కారును తనిఖీ చేశారు. అందులో 35 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. ఎక్కడికి తరలిస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదీ చదవండి: జేసీ ప్రభాకర్ రెడ్డి నా హత్యకు కుట్ర పన్నారు : కేతిరెడ్డి


