breaking news
Etipaka
-
రైతు బలవన్మరణం
ఏటిపాక: ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు బలవన్మరణం చెందాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని ఏటిపాక మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని గన్నవరం గ్రామానికి చెందిన రైతు గొల్ల క్రిష్ణారావు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గత ఏడాది సాగులో నష్టపోయి అప్పుల పాలయ్యాడు. ఆ అప్పులు తీరే మార్గం లేకపోవడం, ఈ ఏడాది సాగు లాభసాటిగా లేకపోవడంతో మనస్తాపం చెందిన క్రిష్ణారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఏటిపాకలో ఆర్డీవో కార్యాలయం
ఆంధ్రప్రదేశ్ సీఎస్ కృష్ణారావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఏపీలో విలీనమైన మండలాల్లో పరిపాలన పర్యవేక్షణకు భద్రాచలం సమీపంలోని ఏటిపాక గ్రామంలో రెవిన్యూ డివిజనల్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. పరిపాలన వ్యవహారాలను స్వీకరించటం పూర్తయిందని, ఆ మండలాల్లో పనిచేసే ఉద్యోగుల డిసెంబర్ వేతనాలను జనవరిలో ఏపీ ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. పరిపాలన గురించి ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో పాటు ఇతర శాఖల అధికారులతో చర్చించినట్లు తెలిపారు.