తెలంగాణ నుంచి ఏపీలో విలీనమైన మండలాల్లో పరిపాలన పర్యవేక్షణకు భద్రాచలం సమీపంలోని ఏటిపాక గ్రామంలో రెవిన్యూ డివిజనల్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ సీఎస్ కృష్ణారావు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఏపీలో విలీనమైన మండలాల్లో పరిపాలన పర్యవేక్షణకు భద్రాచలం సమీపంలోని ఏటిపాక గ్రామంలో రెవిన్యూ డివిజనల్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. పరిపాలన వ్యవహారాలను స్వీకరించటం పూర్తయిందని, ఆ మండలాల్లో పనిచేసే ఉద్యోగుల డిసెంబర్ వేతనాలను జనవరిలో ఏపీ ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు.
పరిపాలన గురించి ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో పాటు ఇతర శాఖల అధికారులతో చర్చించినట్లు తెలిపారు.