ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు బలవన్మరణం చెందాడు.
ఏటిపాక: ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు బలవన్మరణం చెందాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని ఏటిపాక మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని గన్నవరం గ్రామానికి చెందిన రైతు గొల్ల క్రిష్ణారావు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గత ఏడాది సాగులో నష్టపోయి అప్పుల పాలయ్యాడు. ఆ అప్పులు తీరే మార్గం లేకపోవడం, ఈ ఏడాది సాగు లాభసాటిగా లేకపోవడంతో మనస్తాపం చెందిన క్రిష్ణారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.