మహబూబాబాద్ రూరల్ : పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షల్లో తనకు తక్కువ మార్కులు వస్తున్నాయని, దీంతో పదో తరగతి పాస్ అవతానో లేదో అని మనోవేదనకు గురైన ఓ విద్యార్థిని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. టౌన్ సీఐ ఎల్.రఘుపతిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో పాల వ్యాపారం చేసే నక్క స్వామి, సంధ్య దంపతుల చిన్న కూతురు సాయితేజస్విని (16) పట్టణంలోని ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది.
కొన్ని రోజులుగా పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షల్లో తనకు తక్కువ మార్కులు వస్తున్నాయని, దీంతో పదో తరగతి పాస్ అవుతానో లేదో అంటూ బాధపడుతూ ఉండేది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకోగా వారు ఏమి కాదులే పాస్ అవుతావు అంటూ సర్ది చెప్పేవారు. మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి స్థానిక నిజాం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్ప డింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి స్వామి ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్సై మౌనిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇదీ చదవండి: ఫామ్‌హౌస్‌లో రెయిన్‌డ్యాన్స్‌లు చేసిన కానిస్టేబుళ్లు


