సాక్షి, మంచిర్యాల: శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు ఆన్‌డ్యూటీలో ఉండి ఓ ఫామ్‌హౌస్‌లో మందు తాగి చిందులేశారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కత్తెర్ల గ్రామ శివారులోని ప్రైవేటు ఫాంహౌస్‌లో విందు ఏర్పాటు చేసుకుని రెయిన్ డ్యాన్స్ చేశారు.
ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచి్చంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ సహచర పోలీసుల కోసం గత ఆదివారం కత్తెర్ల ఫాంహౌస్‌లో బర్త్‌డే విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు స్టేషన్ చెందిన 14 మంది పోలీసులు హాజరయ్యారు. వీరిలో కొందరు ఆన్‌డ్యూటీలోనే ఉండి హాజరు కాగా, మరికొందరు సెలవులో ఉన్నట్లు తెలుస్తోంది. వేడుకలో మద్యంమత్తులో పురుష కానిస్టేబుళ్లు సహచర మహిళా కానిస్టేబుళ్లతో కలిసి సివిల్ డ్రెస్‌లో జోష్‌గా నృత్యాలు చేశారు.
సరిగ్గా అదే రోజు స్టేషన్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాసరావు ఆన్‌డ్యూటీలో భాగంగా పోలీసు శిక్షణకు వెళ్లినట్లు తెలుస్తోంది. పర్యవేక్షణ అధికారి లేకపోవడంతో అడిగేవారు లేకుండా పోయింది. కానిస్టేబుళ్లు చిందేసిన వీడియో ఒకరు వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్ చేయడంతో పోలీసుల నృత్యాల ఘటన బహిర్గతమైంది. కాగా, విధుల్లో నిర్లక్ష్యం వహించిన కానిస్టేబుళ్లపై రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా వేటు వేశారు. 14 మంది సిబ్బందిలో ఐదుగురిని పోలీసు కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేసి, మరో తొమ్మిది మందిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు.
A group of police officers attached to the Bellampalle One Town Police Station allegedly partied at a farmhouse during duty hours, raising questions about possible dereliction of duty. An enquiry has been set up to investigate the matter. https://t.co/PVR0JTQWr0
— The Siasat Daily (@TheSiasatDaily) November 17, 2026


