ఓటర్ల జాబితా సవరణ గడువు పెంపు | SIR-2026 Voter List Deadline Extended | Sakshi
Sakshi News home page

ఓటర్ల జాబితా సవరణ గడువు పెంపు

Nov 18 2026 1:00 AM | Updated on Nov 18 2026 1:00 AM

SIR-2026 Voter List Deadline Extended

ఏపీ, తెలంగాణ సహా 7 రాష్ట్రాలకు తాజా ఉత్తర్వులు జారీ

డిసెంబర్‌ 15 వరకు అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం

డిసెంబర్‌ 22న ఏకకాలంలో తుది జాబితాల ప్రచురణ

రాజకీయ పారీ్టలకు సమాచారం ఇవ్వాలని సీఈఓలకు ఈసీ ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) షెడ్యూల్‌ను మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సవరించింది. ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిష్కారానికి గడువును డిసెంబర్‌ 15 వరకు పొడిగించింది. సవరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో డిసెంబర్‌ 22న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, నాగాలాండ్, హర్యానా, జార్ఖండ్‌ రాష్ట్రాలకు సంబంధించిన సవరించిన షెడ్యూల్‌ వివరాలను ఈసీ విడుదల చే శారు. అభ్యంతరాల పరిష్కారం, ఏఎస్‌డీడీ (అందుబాటులో లేని, వలస వెళ్లిన, మరణించిన, నకిలీ) ఓటర్ల గుర్తింపుపై రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు (సీఈఓ) స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

ఏఎస్‌డీడీ ఓటర్ల గుర్తింపు టైమ్‌లైన్‌ 
ఓటర్ల జాబితాలో ఏఎస్‌డీడీ ఓటర్ల గుర్తింపునకు సంబంధించి ఈసీ పక్కా టైమ్‌లైన్‌ ఖరారు చేసింది. క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియను వేగవంతం చేసేలా అధికారులకు గడువులు నిర్దేశించింది. ఏఎస్‌డీడీ ఓటర్ల గుర్తింపునకు సంబంధించిన ఎన్యూమరేషన్‌ ఫామ్‌లను నవంబర్‌ 18 నుంచి నవంబర్‌ 30 లోపు పంపిణీ చేసి, పూర్తి చేసిన ఫామ్‌లను తిరిగి సేకరించాలి. ఆ ఎన్యూమరేషన్‌ ఫారాల పరిష్కారాన్ని డిసెంబర్‌ 10 నాటికి పూర్తి చేయాలి.

రాష్ట్రాల వారీగా సవరించిన షెడ్యూల్‌
తాజా ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ, ఏపీతో సహా ఏడు రాష్ట్రాల్లో క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం (నోటీసుల దశ) గడువును ఈసీ ప్రకటించింది. ఆయా రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైన తేదీలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, ముగింపు తేదీని మాత్రం డిసెంబర్‌ 15గా నిర్దేశించింది. ఈ ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సవరణల అనంతరం ఏకకాలంలో డిసెంబర్‌ 22, 2026 న ఓటర్ల తుది జాబితాను ప్రచురిస్తారు.

రాజకీయ పార్టీలకు సమాచారం ఇవ్వాలి
ఓటర్ల జాబితా సవరణపై తాము తీసుకున్న నిర్ణయాన్ని క్షేత్రస్థాయి అధికారులందరికీ చేరవేయాలని సీఈఓలను ఈసీ ఆదేశించింది. సవరించిన ఎస్‌ఐఆర్‌–2026 షెడ్యూల్, ఏఎస్‌డీడీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియపై పత్రికలు, ఎల్రక్టానిక్‌ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించింది. ఈ మార్పులపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు లిఖితపూర్వకంగా సమాచారం అందజేయాలని స్పష్టం చేసింది. సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో పాటు ఈసీలోని సీనియర్‌ డీఈసీలు, డీజీలకు ఈ ఉత్తర్వుల కాపీలను పంపించారు.

ఇదీ చదవండి: తెలంగాణపై సోనియాకు ప్రేమ లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement