ఆమె ఆత్మకథలో రాష్ట్ర ప్రస్తావన లేకపోవడంపై సమాధానం చెప్పాలి
తెలంగాణ రైజింగ్ కాదు.. ఫాలింగ్.. పెట్టుబడులపై శ్వేతపత్రం ఇవ్వాలి
భారత్ సమ్మిట్‌తో ఒరిగిందేమీ లేదు..గోబెల్స్ సమ్మిట్‌గా మారింది
ఫోన్ ట్యాపింగ్‌పై మూడేళ్లుగా అదే డ్రామా.. ప్రజలను పక్కదారి
పట్టించే ఎత్తుగడలు: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం సోనియాగాంధీ దయాభిక్ష కాదని.. కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు సాగించిన మహోన్నత పోరాట ఫలితమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సోని యాగాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించారు. ఆమె గుండెల్లో తెలంగాణ ఉందని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు దీనికి సమాధానం చెప్పాలన్నారు.
తెలంగాణ ఉద్యమ ఉప్పెనకు భయపడే కాంగ్రెస్ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించిందని చెప్పారు. ఇప్పుడు ఆ ఘనతను తమ పార్టీ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో అనేక సమకాలీన రాజకీయ అంశాలపై కేటీఆర్ మాట్లాడారు.
గాందీలకు బాడీగార్డ్‌లా సీఎం రేవంత్
‘తెలంగాణ ఆత్మగౌరవ పోరాట చరిత్ర ఉన్న గడ్డపై సీఎం రేవంత్‌రెడ్డి గాంధీ కుటుంబం ముందు బాడీగార్డ్‌లా వ్యవహరించడం సిగ్గుచేటు. భారత్ సమ్మిట్‌తో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేకపోగా రూ.100 కోట్లు ప్రజాధనం ఖర్చు చేయడంలో ఔచిత్యమేంటో చెప్పాలి. గ్లోబల్ సమ్మిట్ పేరిట మరో ప్రచార కార్య క్రమం నిర్వహించే ముందు గత పెట్టుబడులపై లెక్కలు బయట పెట్టాలి. లేకుంటే వచ్చే నెలలో జరిగే గ్లోబల్ సమ్మిట్ గోబెల్స్ సమ్మిట్‌గానే మిగులుతుంది’అని కేటీఆర్ విమర్శించారు.
‘భూముల ధరలు పడిపోవడం, రియల్ ఎస్టేట్ మందగమనం, హైడ్రా కూల్చివేతలు, 22ఏ భూముల వివాదాలు, వాటర్ ట్యాంకర్లపై ప్రజల ఆధారపడటం తదితరాలన్నీ ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనం. కాంగ్రెస్ పాలనలో మూడేళ్ల పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పనపై శ్వేతపత్రం విడుదల చేయాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కరువును వదిలి మూసీపై ఆర్భాటాలా?
‘365 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించినా రైతులకు సహాయం అందడం లేదు. రుణాల రీషెడ్యూల్ గురించి ప్రభుత్వం ఆలోచించడం లేదు. కాంట్రాక్టు పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 72 శాతం హామీని అమలు చేయడంతో పాటు ఇప్పటివరకు ఇచ్చిన పనుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రాజెక్టుల పేర్లు మార్చడం వల్ల ప్రయోజనం లేదు. కాంగ్రెస్ నేతల పేర్లతో ఉన్న ప్రాజెక్టులు, ప్రాంతాల పేర్లను భవిష్యత్‌లో మేము అధికారంలోకి వస్తే మారుస్తాం. దివంగత జైపాల్‌రెడ్డి పేరిట కొత్త జిల్లా ఏర్పాటుపై సమాచారం లేదు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆయన పేరు పెట్టినందున జాతీయ హోదా తెస్తారేమో చూడాలి’అని కేటీఆర్ చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్‌పై మూడేళ్లుగా అదే డ్రామా
‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడి చేస్తోంది. మూడేళ్లుగా చెప్పిందే చెబుతూ ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకు చిల్లర ఎత్తుగడలు, డైవర్షన్ టాక్టిక్స్ అమలు చేస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, డీపీఆర్‌లు, అనుమతులపై ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో బయటపెడతాం’అని కేటీఆర్ స్పష్టం చేశారు.
కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి చేరికలు
ఆదిలాబాద్ జిల్లా ముధోల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. మంగళవారం తెలంగాణభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గులాబీ కండువాలు కప్పి కేటీఆర్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ముధోల్ నియోజకవర్గ ముఖ్య నేత రమాదేవి ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.
తాండూర్, కుభీర్ మండలాలకు చెందిన 11 మంది సర్పంచ్‌లు, నలుగురు ఉపసర్పంచులు, ఇద్దరు మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, పలువు రు నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరిలో ఎనిమిది మంది సర్పంచ్‌లు బీజేపీ నుంచి, ఒకరు కాంగ్రెస్ నుంచి, ఇద్దరు స్వతంత్రులుగా గెలుపొందిన వారు ఉ న్నారు. నలుగురు ఉపసర్పంచులూ బీజేపీకి చెందిన వారే కావడం గమనార్హం.
ఇదీ చదవండి: ‘సమ్మక్క’పై సానుకూలం


