వాషింగ్టన్: ఖలిస్తానీ వేర్పాటువాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ కేసులో అమెరికాలోని ఓ కోర్టు భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోబల్, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా)మాజీ డైరెక్టర్ సామంత్ గోయెల్‌కు సమన్లు జారీ చేసింది. సమన్లను శుక్రవారం ఫెడ్‌ఎక్స్ ద్వారా పటియాలా హౌస్ కోర్టు, తీస్ హజారీ కోర్టు, ద్వారకా కోర్టులకు పంపినట్లు న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టు క్లర్క్ వెల్లడించారు.
హేగ్ ఒప్పందాన్ని అనుసరించి వీరికి సమన్లు జారీ చేయాలంటూ కోర్టు ఈ నెల 13వ తేదీన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఈ సమన్లను సంబం«దీకులకు చేరేందుకు సహకరించాలని కోరారు. భారతీయ పౌర స్మృతి, భారత ప్రభుత్వ నోటిఫికేషన్ గుర్తించిన విదేశీ సివిల్ కోర్టులు జారీ చేసిన సమన్లను భారత కోర్టులకు పంపడానికి, ఆ కోర్టులే వాటిని జారీ చేసినట్లుగా అందజేయడానికి అనుమతిస్తుందని క్లర్క్ చెప్పారు.
ఇంతకుముందు, హేగ్ ఒప్పందం కింద భారత ప్రభుత్వం ద్వారా సాధారణ పద్ధతిలో సమన్లు అందజేయడానికి ప్రయతి్నంచినప్పటికీ, అది తిరస్కరణకు గురైందని పేర్కొన్నారు. అందుకే, హేగ్ ఒప్పందంలోని ఆరి్టకల్ 19, భారత సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద సమన్లు అందజేస్తున్నామని వివరించారు. అమెరికాలో ఉంటున్న పన్నూ ఉగ్ర ఆరోపణలపై భారత ప్రభుత్వ నిఘా సంస్థల వాంటెడ్ లిస్టులో ఉన్నాడు.
అయితే, ధోవల్ భారత విదేశీ నిఘా సంస్థ ద్వారా పన్నూను చంపించేందుకు కుట్ర పన్నినట్లు నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్‌ఎఫ్‌జే) లాయర్ కోర్టులో ఫిర్యాదు చేశారు. భారత ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం ఇప్పించాలని కోరారు. అయితే, భారత ప్రభుత్వం పన్నూ కేసును దురుద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నంగా విమర్శించింది. ఇటువంటి సమన్లను భారత ప్రభుత్వంలోని న్యాయశాఖ ద్వారా మాత్రమే జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులో కిరాయి హంతకుడికి సుపారీ ఇచ్చినట్లు ఆరోపణలు రుజువు కావడంతో నిఖిల్ గుప్తా అనే భారతీయుడికి ఇదే కోర్టు 19 ఏళ్లకు పైగా జైలు శిక్ష విధించడం తెలిసిందే.


