breaking news
nsa ajit doval
-
బిహార్‌లో ఫేక్ ఐఏఎస్..!
న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారినని, జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)తరఫున అండర్ కవర్ ఏజెంట్‌నని చెప్పుకుంటున్న ఓ ఘరానా మోసగాడిని బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు వాడుతున్న అత్యంత అధునాతన టెస్లా కారు, ఇతర ఖరీదైన వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు. ఖగారియా జిల్లా గోగ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని జమాల్‌పూర్‌లో ఉంటున్న మనీష్ గుప్తాగా గుర్తించారు. అతడి ఇంట్లో తనిఖీలు జరిపారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాసి ఉన్న టెస్లా కారును స్వా«దీనం చేసుకున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ కలిగిన ఇటువంటి కార్లు మనదేశంలో చాలా తక్కువగా ఉన్నాయని పోలీసులు చెప్పారు. దీంతోపాటు, టాటా సఫారీ కారును, భారీగా విదేశీ మద్యం, ఐదు యాపిల్ ఫోన్లు, ఇతర ఖరీదైన వస్తువులను సీజ్ చేశారు. విచారణ సందర్భంగా ఇతడు చూపిన ఐఏఎస్ అధికారి గుర్తింపు కార్డు ఫేక్ అని ఖగారియా ఎస్పీ భానుప్రతాప్ సింగ్ చెప్పారు. ఎన్ఎస్ఏ అజిత్ ధోవల్ అండర్ కవర్ ఏజెంట్‌గా చెప్పుకుంటూ ఇతడు చూపుతున్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కార్డు కూడా నకిలీదేనన్నారు. ఈ కార్డులతో ఇతడు ఖగారియాతోపాటు బిహార్ వ్యాప్తంగా మోసాలు, బెదిరింపులు, వసూళ్లకు పాల్పడినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. ఇతడి ఆస్తుల విలువ రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటిని ఇతడు ఎలా సంపాదించిందీ తెలుసుకునేందుకు వివిధ విభాగాల సహకారం తీసుకుంటామని ఎస్పీ వివరించారు. పారిన్ మద్యం.. జింక కొమ్ములు గుప్తా నివాసంలో జరిపిన సోదాల్లో అధికారులు కళ్లు చెదిరే స్థాయిలో ఖరీదైన వస్తువులు, మద్యం ఉండటం చూసి కంగుతిన్నారు. దిగుమతి చేసుకున్న విదేశీ మద్యం 31 లీటర్లకుపైగా ఉన్నట్లు గుర్తించారు. వీటితోపాటు ఐదు ఐఫోన్లు, 23 క్రెడిట్ కార్డులు, 8 డెబిట్ కార్డులు, నాలుగు చెక్ బుక్కులను గుర్తించారు. తనిఖీల్లో ఇంట్లో రెండు జింక కొమ్ములు కూడా బయటపడ్డాయి. అటవీ సంరక్షణ చట్టం ప్రకారం వీటిని కలిగి ఉండటం నేరం. పలు అటవీ సంరక్షణకు సంబంధించిన ట్రోఫీలను కూడా స్వా«దీనం చేసుకున్నారు. ఇతడి నివాసం వద్ద అమర్చిన 11 సీసీటీవీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులోని ఫుటేజీని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. -
ఒక్క సాక్ష్యమైనా ఉందా?
చెన్నై: ఆపరేషన్ సిందూర్ విషయంలో విదేశీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని జాతీయ భద్రతా సలహాదారు అజిద్ దోవల్ మండిపడ్డారు. ఈ ఆపరేషన్‌లో భారత్‌కు నష్టం వాటిల్లినట్లు కనీసం ఒక్క ఫొటో అయినా చూపించగలరా? కనీసం ఒక గాజు ముక్క అయినా పగిలినట్లు నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల భరతం పట్టడానికి భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ భారత్‌కు గర్వించదగ్గ ఘట్టమని అభివర్ణించారు. ఈ ఆపరేషన్‌లో భారత్ సైతం భారీగా నష్టపోయిందంటూ అంతర్జాతీయ మీడి యాలో వస్తున్న కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో శుక్రవారం ఐఐటీ–మద్రాసు 62వ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి అజిత్ దోవల్ ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) భూభాగంలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఒక్క టార్గెట్ కూడా గురి తప్పలేదని స్పష్టంచేశారు. ఎవరు(ఉగ్రవాదులు) దాక్కున్నారో తమకు తెలుసని, మే 7వ తేదీన కేవలం 23 నిమిషాల్లో తొమ్మిది శిబిరాలు నేలమట్టం అయిపోయాయని పేర్కొన్నారు. సరిహద్దుకు దూరంగా సరిగ్గా ఉగ్రవాద శిబిరాలపైనే దాడి చేశామని తెలిపారు. అవన్నీ పాకిస్తాన్ ఫొటోలే.. ‘‘పాకిస్తాన్లో 13 ఎయిర్‌బేస్‌లు ధ్వంసమైనట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. మే 10వ తేదీకి ముందురోజు, తర్వాతి రోజు ఫొటోలను ప్రచురించింది. అవి పాకిస్తాన్‌లోని సర్గోధా, రహీంయార్‌ఖాన్, చాక్లాలా ప్రాంతాలకు సంబంధించిన చిత్రాలే. వాటిలో భారత్‌కు సంబంధించిన ఫొటో ఒక్కటైనా ఉందా? అలాంటప్పుడు భారత్‌కు నష్టం జరిగిందని ఎలా అంటారు? పాకిస్తాన్ సైన్యం ఇండియాకు వ్యతిరేకంగా అది చేసింది, ఇది చేసింది అంటూ అంతర్జాతీయ మీడియా చెబుతున్నదాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇండియాకు నష్టం జరిగినట్లు ఒక్క సాక్ష్యం ఉన్నా చూపించాలి. పాకిస్తాన్‌పై దాడులు చేసి వెనక్కి వస్తుండగా ఒక్క గాజు ముక్క కూడా పగిలిపోలేదు. పాక్ ప్రయోగించిన క్షిపణులను మన గగనతల రక్షణ వ్యవస్థ మధ్యలోనే కూల్చివేసింది. ఆపరేషన్ సిందూర్‌లో దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృత స్థాయిలో ఉపయోగించినందుకు గర్వపడుతున్నాం. అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు చేయగలమని ఈ ఆపరేషన్ ద్వారా భారత సైన్యం నిరూపించింది. మన సైన్యం శక్తి ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చింది’’ అని అజిత్ దోవల్ వివరించారు. ఏఐ ఒక గేమ్ చేంజర్ యుద్ధ తంత్రానికి టెక్నాలజీ అనుసంధానించడం చాలా కీలకమని అజిత్ దోవల్ చెప్పారు. మన అవసరాలకు తగ్గట్టుగా దేశీయంగానే టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ క్షిపణులు, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కంట్రోల్, కమాండ్ సిస్టమ్ ఉపయోగించామని, ఇవి దేశీయంగానే అభివృద్ధి చేసుకున్నవేనని గుర్తుచేశారు. కృత్రిమ మేధ(ఏఐ) ఒక గేమ్‌చేంజర్ అని తెలియజేశారు. దానిని కేంద్ర బిందువుగా చేసుకోవాలన్నారు. -
ఎన్ఎస్జీ, గరుడ్ కమాండోల మోహరింపు
భారత భద్రతాదళాల్లోనే అత్యున్నత నైపుణ్యం కలిగిన ఎన్ఎస్జీ, భారత వైమానిక దళానికి చెందిన గరుడ్ కమాండో ఫోర్స్ దళాలు ఉగ్రవాదులపై కౌంటర్ ఎటాక్‌లో పాల్గొంటున్నాయి. పంజాబ్ ఎయిర్‌బేస్ మీద పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిని తిప్పికొట్టేందుకు ఈ బలగాలతో పాటు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ దళాలను అక్కడ మోహరించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మొత్తం ఆపరేషన్‌ను సమన్వయం చేస్తున్నారు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఉగ్రదాడి మొదలు కాగా, 6-6.30 గంటల మధ్యలో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు లోపల ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వాళ్లను కూడా ఇప్పటికే హతమార్చారా.. లేదా అన్న విషయం మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. ఉదయం 8 గంటల తర్వాత పెద్దగా కాల్పుల శబ్దాలు వినిపించడం లేదని ఎయిర్‌బేస్‌కు అత్యంత సమీపంలో ఉన్న జాతీయ మీడియా చానళ్ల ప్రతినిధులు చెబుతున్నారు. హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించామని, ఇప్పటికే అక్కడున్న భద్రతా దళాలకు వాటిని సహాయంగా అందుబాటులో ఉంచుతున్నామని డీఐజీ విజయ్ ప్రతాప్ సింగ్ చెప్పారు. ఉగ్రవాదులను పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోని డొమెస్టిక్ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేశామని, దాంతో టెక్నికల్ ఏరియా మొత్తం సురక్షితంగా ఉందని తెలిపారు. మరోవైపు.. ఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్నతాధికారులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. మొత్తం పరిస్థితిని అత్యున్నత స్థాయిలో సమీక్షిస్తున్నారు. ఉగ్రదాడి కారణంగా పంజాబ్‌లోని లూథియానా ప్రాంతంలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.


