కాబూల్: అఫ్గానిస్థాన్‌లో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 29న ఉదయం 6.39 గంటలకు భూమి కంపించింది. ఎన్‌సీఎస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అఫ్గానిస్థాన్‌లోని ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 92 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. భూమికి 228 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు.
ఈ భూకంపం కారణంగా ఎలాంటి నష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు. భూకంప ప్రభావానికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది. అఫ్గానిస్థాన్‌లో కొద్ది రోజుల క్రితం కూడా భూకంపం సంభవించింది. అక్టోబర్ 25న రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రత నమోదైనట్లు ఎన్‌సీఎస్ తెలిపింది. భారత కాలమానం ప్రకారం ఆ రోజు రాత్రి 11.14 గంటల 22 సెకన్లకు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్‌పై కొలుస్తారు. సాధారణంగా 7.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు.
ఇదీ చదవండి: Israel Election: నెతన్యాహూకు షాక్.. మెజారిటీకి దూరం!


