మహీంద్రా హార్వెస్ట్‌ యువ: వివరాలు | Mahindra Harvest Yuva Details And Company Won Earthshot Prize 2026 | Sakshi
Sakshi News home page

మహీంద్రా హార్వెస్ట్‌ యువ: వివరాలు

Nov 20 2026 1:51 PM | Updated on Nov 20 2026 1:57 PM

Mahindra Harvest Yuva Details And Company Won Earthshot Prize 2026

మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ తాజాగా హార్వెస్ట్‌ యువ పేరిట హార్వెస్టర్‌ను ప్రవేశపెట్టింది. ఇది 50 హెచ్‌పీ శ్రేణిలో తొలి సెల్ఫ్‌ ప్రొపెల్డ్‌ హార్వెస్టర్‌ అని సంస్థ తెలిపింది. చిన్న కమతాల్లోను సులువుగా పని చేసుకునేందుకు వీలుగా తేలికగా, పొందికైన 4 వీల్‌ డ్రైవ్‌ డిజైన్‌తో ఉంటుందని వివరించింది. భారీ సెల్ఫ్‌ ప్రొపెర్డ్‌ హార్వెస్టర్లతో పోలిస్తే ఇది 25 శాతం తక్కువ ధరకే (సుమారు రూ. 7 లక్షల వరకు) ఇది లభిస్తుందని పేర్కొంది. వరి, గోధుమ, సోయాబీన్‌లాంటి పంటలు పండే వివిధ రకాల నేలల్లో పని చేసేందుకు అనువుగా ఉంటుందని వివరించింది.

మహీంద్రా లాస్ట్‌ మైల్‌ మొబిలిటీకి ‘ఎర్త్‌షాట్‌’ పురస్కారం 
మహీంద్రా లాస్ట్‌ మైల్‌ మొబిలిటీ (ఎంఎల్‌ఎంఎంఎల్‌) ప్రతిష్టాత్మకమైన ‘ది ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ 2026’ పురస్కారాన్ని దక్కించుకుంది. డ్రైవర్లు, చిన్న వ్యాపారస్తులకు దన్నుగా ఉంటూ, పర్యావరణహితమైన విధంగా లాస్ట్‌–మైల్‌ మొబిలిటీకి తోడ్పాటు అందిస్తున్నందుకు గాను ‘క్లీన్‌ అవర్‌ ఎయిర్‌’ కేటగిరీలో దీన్ని అందుకుంది. ప్రిన్స్‌ విలియమ్‌ ఏర్పాటు చేసిన ఈ అవార్డు కింద కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు 1 మిలియన్‌ పౌండ్ల గ్రాంటును ఎంఎల్‌ఎంఎంఎల్‌కి అందించారు. దేశీయంగా 4,00,000కు పైగా ఎలక్ట్రిక్‌ కమర్షియల్‌ వాహనాలను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. 1,85,000 మెట్రిక్‌ టన్నుల కర్బన ఉద్గారాలను నివారించేందుకు ఇవి దోహదపడ్డాయని వివరించింది.

ఇదీ చదవండి: హోండా రెబల్ 500 లాంచ్: ధర ఎంతంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement