మహీంద్రా CNG కారుకు 5 స్టార్ రేటింగ్.. సేఫ్టీలో అదుర్స్! | Mahindra XUV 3XO ZNG Secures 5 Star Bharat NCAP Rating | Sakshi
Sakshi News home page

మహీంద్రా CNG కారుకు 5 స్టార్ రేటింగ్.. సేఫ్టీలో అదుర్స్!

Nov 17 2026 11:29 AM | Updated on Nov 17 2026 11:34 AM

Mahindra XUV 3XO ZNG Secures 5 Star Bharat NCAP Rating

దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సీఎన్‌జీ మోడల్‌తో మరో ఘనత సాధించింది. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. దీంతో 5 స్టార్ రేటింగ్ పొందిన తొలి సబ్ కాంపాక్ట్ సీఎన్‌జీ ఎస్‌యూవీగా ఈ ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ నిలిచింది.

అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP) విభాగంలో 32కి 29.36 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP) విభాగంలో 49కి 45 పాయింట్లు సాధించింది. ఇప్పటికే ఈ ఎస్‌యూవీ పెట్రోల్ వెర్షన్ కూడా 2024 నవంబర్‌లో 5 స్టార్ రేటింగ్ పొందింది.

భద్రత విషయానికి వస్తే ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సీఎన్‌జీలో 35 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రత్యేకంగా సీఎన్‌జీ వాహనాల కోసం గ్యాస్ లీకేజీని గుర్తించే వ్యవస్థను కూడా అందించారు. ఒకవేళ గ్యాస్ లీక్ అయినట్లు గుర్తిస్తే ఆటోమేటిక్‌గా పెట్రోల్ మోడ్‌లోకి మారుతుంది.

ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 110 bhp పవర్, 200 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే ఈ ఎస్‌యూవీ 24.70 కిమీ/కేజీ మైలేజీని ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.

ఇక బూట్ స్పేస్ విషయంలోనూ మహీంద్రా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. సాధారణంగా సీఎన్‌జీ సిలిండర్ల వల్ల కార్లలో లగేజ్ పెట్టుకునే స్థలం తగ్గుతుంది. కానీ.. ఇందులో అండర్‌ఫ్లోర్ ట్విన్ సిలిండర్ సెటప్‌ను ఉపయోగించడంతో 270 లీటర్ల ఉపయోగకరమైన బూట్ స్పేస్ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ఫ్లాట్ లోడింగ్ ఫ్లోర్ కూడా లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement