breaking news
CNG Cars
-
హైదరాబాద్లో సీఎన్జీ వాహనాలకు కష్టాలు
హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న సీఎన్జీ వాహనాల సంఖ్యకు అనుగుణంగా గ్యాస్ స్టేషన్ల విస్తరణ జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నగర పరిధిలో కేవలం 83 సీఎన్జీ స్టేషన్లే ఉన్నాయి. ఇవి రోజూ 55 వేల నుంచి 60 వేల వాహనాలకు గ్యాస్ సేవలు అందిస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.లోక్సభలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పలు కీలక వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లో ప్రజారవాణా వాహనాలు, ఆటోలు, ప్రైవేట్ వాహనాలు అధికంగా సీఎన్జీపైనే ఆధారపడుతున్నాయి. కానీ స్టేషన్ల తక్కువ సంఖ్య వల్ల వాహనదారులు గంటలకొద్దీ క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి లోక్సభ వేదికగా తెలిపారు. -
బెస్ట్ సీఎన్జీ కార్లు: ధర రూ.10 లక్షల కంటే తక్కువే..
పెట్రోల్ ధరలు పెరగడం, సీఎన్జీ రీఫ్యూయలింగ్ స్టేషన్లు అందుబాటులోకి రావడం అన్నీ జరుగుతున్నాయి. ఈ తరుణంలో చాలామంది పెట్రోల్ కార్ల స్థానంలో సీఎన్జీ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఉత్తమ సిఎన్జీ కార్లను గురించి తెలుసుకుందాం.మారుతి సుజుకి ఆల్టో కే10 సీఎన్జీప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన సీఎన్జీ కార్లలో ఒకటి 'మారుతి సుజుకి ఆల్టో కే10'. ఎల్ఎక్స్ఐ (ఓ), వీఎక్స్ఐ (ఓ) వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు ధరలు రూ. 5.8 లక్షలు, రూ. 6.04 లక్షలు. ఇందులోని 998 సీసీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5300 rpm వద్ద 56 Bhp పవర్, 3400 rpm వద్ద 82.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ పొందుతుంది. ఈ కారు 33.85 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుందని సమాచారం.మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో సీఎన్జీఇది కూడా ఎల్ఎక్స్ఐ (ఓ), వీఎక్స్ఐ (ఓ) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధరలు వరుసగా రూ. 5.91 లక్షలు, రూ. 6.11 లక్షలు. ఈ కారులో 998 సీసీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 56 Bhp పవర్, 82.1 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది 32.73 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది.టాటా టియాగో సీఎన్జీటాటా టియాగో సీఎన్జీ ధరలు రూ. 6 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో ట్విన్ సిలిండర్ CNG ట్యాంక్ ఉంటుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన సీఎన్జీ కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ కారు ఐదు మాన్యువల్, మూడు ఆటోమాటిక్ వేరియంట్లలో లభిస్తుంది. మాన్యువల్ ధరలు రూ. 5.99 లక్షల నుంచి రూ. 8.19 లక్షల మధ్య ఉన్నాయి. ఆటోమాటిక్ ధరలు రూ. 7.84 లక్షల నుంచి రూ. 8.74 లక్షల మధ్య ఉన్నాయి.మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ సీఎన్జీమారుతి సుజుకి వ్యాగన్ ఆర్ సీఎన్జీ.. ఎల్ఎక్స్ఐ (ఓ), విఎక్స్ఐ (ఓ) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 6.54 లక్షల నుంచి రూ. 6.99 లక్షల వరకు ఉంటాయి. ఇది 998 సీసీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ద్వారా 5300 ఆర్పీఎమ్ వద్ద 56 బిహెచ్పీ పవర్ఉ.. 3400 ఆర్పీఎమ్ వద్ద 82.1 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. దీని మైలేజ్ 33.47 కిమీ/కేజీ వరకు ఉంది.ఇదీ చదవండి: అమ్మకాల్లో టాప్ కంపెనీలు.. ఎక్కువమంది కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!మారుతి సుజుకి సెలెరియో సీఎన్జీమారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ.. భారతదేశంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్జీ కార్లలో ఒకటి. దీని ధర రూ. 6.90 లక్షలు. ఇది 34 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. ఈ కారులోని 998 సీసీ ఇంజిన్ 5300 rpm వద్ద, 55.92 Bhp పవర్ & 3400 rpm వద్ద 82.1 Nm టార్క్ అందిస్తుంది. -
ఎక్కువ మైలేజ్ కోసం.. ఇవిగో బెస్ట్ సీఎన్జీ కార్లు
ఇండియన్ మార్కెట్లో పెట్రోల్, ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే కాకుండా CNG కార్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఎందుకంటే సాధారణ పెట్రోల్ కారు కంటే సీఎన్జీ కారు కొంత ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు.. తమ వాహనాలను సీఎన్జీ రూపంలో లాంచ్ చేస్తున్నాయి. ఈ కథనంలో రూ. 9 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే సీఎన్జీ కార్లను గురించి తెలుసుకుందాం.మారుతి సుజుకి ఫ్రాంక్స్ సీఎన్జీ (Maruti Suzuki Fronx CNG)మార్కెట్లో లాంచ్ అయిన అతి తక్కువ కాలంలోనే.. కంపెనీ తన ఫ్రాంక్స్ కారును సీఎన్జీ రూపంలో లాంచ్ చేసింది. చూడటానికి సాధారణ కారు మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ కనిపిస్తాయి. ఈ కారు ధర రూ. 8.46 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 1197 సీసీ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. ఇది 28.51 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది.టాటా పంచ్ సీఎన్జీ (Tata Punch CNG)భారతదేశంలో అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటి, ఎక్కువ అమ్ముడైన మైక్రో ఎస్యూవీ టాటా పంచ్. ఇది మార్కెట్లో పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ రూపాల్లో అందుబాటులో ఉంది. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించిన ఈ టాటా పంచ్ సీఎన్జీ 26.99 కిమీ / కేజీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 7.23 లక్షలు (ఎక్స్-షోరూమ్). ధర అనేది ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది.హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్ సీఎన్జీ (Hyundai Exter S CNG)రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో లభించే బెస్ట్ సీఎన్జీ కార్లలో.. హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్ సీఎన్జీ కూడా ఉంది. దీని ధర రూ. 8.43 లక్షలు. ఇది 27.1 కిమీ / కేజీ మైలేజ్ అందిస్తుంది. మార్కెట్లో ఈ కారు మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. మైలేజ్ సాధారణ మోడల్ కంటే కొంత ఎక్కువ.