భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లోకి ప్రవేశించిన.. మారుతి సుజుకి విక్టోరిస్ ఇప్పటి వరకు 33,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను పొందింది. ఇందులో 30 శాతం కంటే ఎక్కువ బుకింగ్స్ CNG వేరియంట్ సొంతం చేసుకుంది. దీనికి కారణం బూట్ స్పేస్ అనే చెప్పాలి.
మారుతి సుజుకి తన విక్టోరిస్ కారులో.. సాధారణ కారులో అందించేంత బూట్ స్పేస్ అందిస్తోంది. ఇది CNG వేరియంట్ అమ్మకాలను పెంచడంలో దోహదపడిందని.. కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) పార్థో బెనర్జీ పేర్కొన్నారు. విక్టోరిస్ CNG వేరియంట్‌లకు ఇప్పటి వరకు దాదాపు 11,000 బుకింగ్‌లు వచ్చాయని వెల్లడించారు.
మారుతి సుజుకి విక్టోరిస్.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ధరలు రూ.10.50 లక్షల నుంచి రూ. 19.98 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది మొత్తం మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో లభిస్తుంది. ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG టెక్నాలజీతో అందుబాటులో ఉంటుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్, e-CVT ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.
ఇదీ చదవండి: భారత్‌కు అమెరికన్ కంపెనీ: రూ.3,250 కోట్ల పెట్టుబడి!
మైల్డ్-హైబ్రిడ్ టెక్‌తో కూడిన 1.5-లీటర్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్‌తో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ e-CVTని పొందుతుంది, పెట్రోల్-CNG మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇవన్నీ మంచి పనితీరును అందిస్తాయి.


