మహానది కోల్‌ఫీల్డ్స్‌ ఐపీవో ఎప్పుడంటే? | Mahanadi CoalFields IPO Details | Sakshi
Sakshi News home page

మహానది కోల్‌ఫీల్డ్స్‌ ఐపీవో ఎప్పుడంటే?

Nov 17 2026 8:33 AM | Updated on Nov 17 2026 8:52 AM

Mahanadi CoalFields IPO Details

ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం కోల్‌ ఇండియా అనుబంధ సంస్థ మహానది కోల్‌ఫీల్డ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 19న ప్రారంభం కానుంది. ఇష్యూ ధరల శ్రేణి షేరుకి రూ. 129-136కాగా.. మాతృ సంస్థ కోల్‌ ఇండియా 66.18 కోట్ల షేర్లు విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 8,981 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది.

దీంతో మహానదికి ఇష్యూ నిధులు లభించవు. 23న ముగియనున్న ఇష్యూలో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్లకు 18న షేర్లను ఆఫర్‌ చేయనుంది. ఈ నెల 27కల్లా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టయ్యే వీలుంది. లిస్టింగ్‌లో ఈ ఒడిషా కంపెనీ రూ. 90,000 కోట్ల మార్కెట్‌ విలువను అందుకోగలదని అంచనా.  కోల్‌ ఇండియా  ఇప్పటికే భారత్‌ కోకింగ్‌ కోల్, సెంట్రల్‌ మైన్‌ ప్లానింగ్‌ అండ్‌ డిజైన్‌ ఇన్‌స్టిట్యూట్‌లను లిస్ట్‌ చేయడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement