breaking news
Mahanadi Coalfields Limited
-
మహానది కోల్‌ఫీల్డ్స్ ఐపీవో ఎప్పుడంటే?
ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం కోల్ ఇండియా అనుబంధ సంస్థ మహానది కోల్‌ఫీల్డ్స్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 19న ప్రారంభం కానుంది. ఇష్యూ ధరల శ్రేణి షేరుకి రూ. 129-136కాగా.. మాతృ సంస్థ కోల్ ఇండియా 66.18 కోట్ల షేర్లు విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 8,981 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది.దీంతో మహానదికి ఇష్యూ నిధులు లభించవు. 23న ముగియనున్న ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను ఆఫర్ చేయనుంది. ఈ నెల 27కల్లా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయ్యే వీలుంది. లిస్టింగ్‌లో ఈ ఒడిషా కంపెనీ రూ. 90,000 కోట్ల మార్కెట్ విలువను అందుకోగలదని అంచనా. కోల్ ఇండియా ఇప్పటికే భారత్ కోకింగ్ కోల్, సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్లను లిస్ట్ చేయడం తెలిసిందే. -
ఉద్యోగాలు
మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. స్టాఫ్ నర్స్: 36 అర్హతలు: జనరల్ నర్సింగ్‌లో డిగ్రీ/నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీలో డిప్లొమా ఉండాలి. అడియోమెట్రిస్ట్: 4 ఫార్మసిస్ట్: 9 డెంటల్ టెక్నీషియన్:2 డైటీషియన్: 2 ఈసీజీ టెక్నీషియన్: 6 ల్యాబ్ టెక్నీషియన్: 10 ఎక్స్‌రే టెక్నీషియన్: 7 ఆప్టోమెట్రిస్ట్: 2 ఫిజియోథెరపిస్ట్: 3 అర్హతలు: ఇంటర్‌తో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి. జూనియర్ శానిటరీ ఇన్స్పెక్టర్: 5 అర్హతలు: పదో తరగతితో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ డిప్లొమా లేదా సర్టిఫికెట్ ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: నవంబర్ 10 వెబ్సైట్: http://www.mcl.gov.in/


