పండుగ సీజన్ మొదలైంది.. ఈ తరుణంలో దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' ఎంపిక చేసిన కొన్ని కార్ల కొనుగోలుపై ఆఫర్లను ప్రకటించింది. సంస్థ అందించే ప్రయోజనాలు.. వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటాయి. ఇందులో ఎక్స్ఛేంజ్, కార్పొరేట్ ఆఫర్ల నుంచి నగదు తగ్గింపులు, యాక్సెసరీ ప్యాకేజీల వరకు ప్రయోజనాలు ఉన్నాయి.
ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ
మహీంద్రా తన ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ వేరియంట్ కొనుగోలుపై తగ్గింపులు అందిస్తోంది. ఇందులో అధిక ప్రయోజనాలు ఎంఎక్స్2, ఎంఎక్స్3, ఎంఎక్స్3 ప్రో పెట్రోల్ వేరియంట్లకు మాత్రమే లభిస్తాయి. మొత్తం రూ.60,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో రూ.40,000 నగదు తగ్గింపు, రూ. 20,000 విలువైన యాక్సెసరీలు లభిస్తాయి.
డీజిల్ వేరియంట్లపై రూ.25,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో రూ. 10,000 నగదు తగ్గింపు, రూ. 15,000 విలువైన యాక్సెసరీలు లభిస్తాయి.
స్కార్పియో క్లాసిక్, స్కార్పియో ఎన్
స్కార్పియో క్లాసిక్ రెండు వేరియంట్లపైన పండుగ ప్రయోజనాలు లభిస్తాయి. క్లాసిక్ S వేరియంట్‌పై రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 20,000 విలువైన యాక్సెసరీలు లభించగా.. క్లాసిక్ S11 వేరియంట్‌పై రూ. 25,000 నగదు తగ్గింపు, రూ. 20,000 విలువైన యాక్సెసరీలు లభిస్తాయి.
స్కార్పియో N Z8L 7-సీటర్ 4WD AT పై అత్యధిక ఆఫర్ అందుబాటులో ఉంది. దీనిపై రూ. 1.25 లక్షల నగదు తగ్గింపుతో పాటు రూ. 25,000 విలువైన యాక్సెసరీలు లభిస్తాయి, దీనివల్ల మొత్తం ప్రయోజనాలు రూ. 1.5 లక్షల వరకు ఉంటాయి. స్కార్పియో N 2WD AT వేరియంట్లపై రూ. 50,000 నగదు ప్రయోజనం, రూ. 25,000 యాక్సెసరీ ప్యాకేజీ లభిస్తుంది.
థార్, థార్ రాక్స్
ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మహీంద్రా థార్ 4WD పెట్రోల్, డీజిల్ వెర్షన్లు రెండింటిపై రూ. 50,000 నగదు తగ్గింపు, రూ. 30,000 విలువైన ఉచిత యాక్సెసరీలు లభిస్తున్నాయి, దీని ఫలితంగా మొత్తం రూ. 80,000 ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. థార్ 2WD LX కు రూ. 30,000 విలువైన ఉచిత యాక్సెసరీలు లభిస్తాయి. అయితే ఈ నెలలో మహీంద్రా థార్ రాక్స్‌పై ఎలాంటి డిస్కౌంట్లు అందుబాటులో లేదు.
ఎక్స్‌యూవీ400 ఈవీ, బీఈ 6
మహీంద్రా తన XUV400 EV EL ప్రోపై ఏకంగా రూ.1 లక్ష నగదు తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ పండుగ సీజన్లో కంపెనీ శ్రేణిలో అత్యధిక తగ్గింపు పొందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది.
కొత్తగా విడుదలైన మహీంద్రా BE 6, XEV 9E మోడళ్లకు సంబంధించిన ఆఫర్లు వెల్లడించలేదు. కానీ.. ప్రాంతం మరియు లభ్యతను బట్టి కొనుగోలుదారులు డీలర్-స్థాయి ఆఫర్లను పొందవచ్చని మహీంద్రా పేర్కొంది.
Note: మహీంద్రా అందిస్తున్న ఆఫర్స్ లేదా ప్రయోజనాలు నగరం, డీలర్షిప్, స్టాక్ లభ్యత, వేరియంట్, వర్తించే నిబంధనలు, షరతులను బట్టి ఆఫర్లు మారే అవకాశం ఉంది. కాబట్టి కొనుగోలు చేసే ముందు, కొనుగోలుదారులు తాము ఎంచుకున్న మోడల్‌కు వర్తించే ఖచ్చితమైన డిస్కౌంట్లు, ప్రయోజనాల కోసం తమ సమీపంలోని మహీంద్రా డీలర్‌షిప్‌ను సందర్శించడం మంచిది. అంతే కాకుండా ఈ ఆఫర్స్ ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: మహీంద్రా XUV 3XO సీఎన్జీ లాంచ్: ధర ఎంతంటే?


