మహీంద్రా XUV 3XO సీఎన్‌జీ లాంచ్: ధర ఎంతంటే? | Mahindra XUV 3XO CNG Launched In India At Rs 9.99 Lakh | Sakshi
Sakshi News home page

మహీంద్రా XUV 3XO సీఎన్‌జీ లాంచ్: ధర ఎంతంటే?

Oct 15 2026 4:55 PM | Updated on Oct 15 2026 5:12 PM

Mahindra XUV 3XO CNG Launched In India At Rs 9.99 Lakh

మహీంద్రా అండ్ మహీంద్రా భారతదేశంలో ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సీఎన్‌జీని లాంచ్ చేసింది. దీని ధర రూ.9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలలో అందుబాటులో ఉండే ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సీఎన్‌జీ రూపంలో కూడా అందుబాటులోకి వచ్చింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సీఎన్‌జీ.. 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ ఎంపీఎఫ్ఐ పెట్రోల్ ఇంజిన్‌ పొందుతుంది. ఇది 114 హార్స్ పవర్, 200 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది సీఎన్‌జీ మోడ్‌లో 24.7 కి.మీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. 0-60 కి.మీ/గం వేగాన్ని సుమారు 4.9 సెకన్లలో.. 0-100 కి.మీ/గం వేగాన్ని 11.8 సెకన్లలో అందుకుంటుందని సంస్థ వెల్లడించింది.

సేఫ్టీ ఫీచర్ల జాబితాలో.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని సీట్లకు సీట్‌బెల్ట్ రిమైండర్‌లు, నాలుగు డిస్క్ బ్రేక్‌లు, పటిష్టమైన ఛాసిస్ ఉన్నాయి. ఈ కారు ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

ఇదీ చదవండి: రూ.6.99 లక్షలకే.. 2026 టయోటా గ్లాంజా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement