Saudi: భారత పౌరులకు భద్రతా హెచ్చరికలు | India asks its nationals in Saudi Arabia to follow safety directives | Sakshi
Sakshi News home page

Saudi: భారత పౌరులకు భద్రతా హెచ్చరికలు

Oct 19 2026 8:18 AM | Updated on Oct 19 2026 8:45 AM

India asks its nationals in Saudi Arabia to follow safety directives

సౌదీ: యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాల్పడుతుండటంతో అక్కడ భద్రతా ఆందోళనలు తీవ్రమయ్యాయి. అక్టోబర్ 10న రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒక భారతీయుడు మరణించడంతో పాటు పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో స్థానిక అధికార యంత్రాంగం జారీ చేసిన అత్యవసర మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులను కోరింది.

సౌదీ అత్యవసర హెచ్చరికల వ్యవస్థ (నేషనల్ ఎర్లీ వార్నింగ్ ప్లాట్‌ఫామ్) నుంచి సమాచారం రాగానే ప్రజలు భయాందోళన చెందకుండా వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ప్రమాదం ముగిసే వరకు ఇళ్లలోనే ఉండాలని, కిటికీలు, బాల్కనీలు, టెర్రస్‌లకు దూరంగా లోపలి గదుల్లో తలదాచుకోవాలని స్పష్టం చేశారు. ఒకవేళ బయట ఉంటే సమీపంలోని భవనంలోకి వెళ్లాలని, వాహనాలు నడుపుతుంటే ఫ్లైఓవర్లు, ఎత్తైన కట్టడాలకు దూరంగా సురక్షితంగా ఆపాలని సూచించారు.

అలాగే భద్రతా ఘటనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయడం లేదా ప్రచారం చేయడం పూర్తిగా నిషేధమని హెచ్చరించారు. అక్కడి ప్రజల రక్షణ కోసం సౌదీ అధికారులు అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచారు. ఏదైనా ప్రమాదం లేదా ముప్పు ఎదురైతే మక్కా, మదీనా, రియాద్, తూర్పు ప్రావిన్స్ ప్రాంతాల వారు 911 నంబర్‌కు, ఇతర ప్రాంతాల్లోని వారు 998 నంబర్‌కు కాల్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు. అధికారిక మార్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, పుకార్లను నమ్మవద్దని రాయబార కార్యాలయం భారత పౌరులకు స్పష్టం చేసింది. 

ఇదీ చదవండి: ట్రంప్‌ ‘గోల్ఫ్‌’ పంచాయితీ.. అధ్యక్షునికి షాకిచ్చిన హైకోర్టు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement