బంగారం, వెండి భారీ క్రాష్.. కియోసాకి ట్వీట్ | Gold Silver Bitcoin Crashing Robert Kiyosaki Tweet | Sakshi
Sakshi News home page

బంగారం, వెండి భారీ క్రాష్.. కియోసాకి ట్వీట్

Nov 20 2026 1:25 PM | Updated on Nov 20 2026 1:39 PM

Gold Silver Bitcoin Crashing Robert Kiyosaki Tweet

ప్రముఖ ఇన్వెస్టర్, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా బంగారం, వెండి, బిట్‌కాయిన్ ధరల పతనంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

క్రాష్.. మంచిదా?, చెడ్డదా? అని మొదలుపెట్టిన కియోసాకి.. ప్రస్తుతం బంగారం, వెండి, బిట్‌కాయిన్ ధరలు పడిపోతున్నాయని, ఆ భయంతో కొంతమంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. అయితే.. నిజమైన పెట్టుబడిదారులు ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేస్తారని వెల్లడించారు.

బిట్‌కాయిన్ ధర పడిపోవడమే తనకు ఎక్కువ ఆసక్తిని కలిగిస్తోందని కియోసాకి చెప్పారు. ధరలు తగ్గుతున్న సమయంలో మరిన్ని బిట్‌కాయిన్లు కొనుగోలు చేయడానికి తాను ఎదురుచూస్తున్నానని తెలిపారు. అయితే.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ (FED), బ్యాంకులు, బాండ్ మార్కెట్లలోని సమస్యలు, అమెరికా పెరుగుతున్న అప్పులు వంటి అంశాలు సంప్రదాయ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవస్థలో సంపద సాధారణ ప్రజల నుంచి ఆర్థిక సంస్థలకు వెళ్తోందని విమర్శించారు.

ఇదీ చదవండి: ఒక్కసారిగా పడిపోయిన బంగారం, వెండి ధరలు!

బిట్‌కాయిన్‌పై కియోసాకికి ప్రత్యేక ఆసక్తి ఉండటానికి ప్రధాన కారణం.. దాని పరిమిత సరఫరా. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 21 మిలియన్ల బిట్‌కాయిన్లు మాత్రమే సృష్టించబడేలా దాని వ్యవస్థను రూపొందించారు. ఇప్పటికే సుమారు 20 మిలియన్ల బిట్‌కాయిన్లు మైనింగ్ ద్వారా వెలుగులోకి వచ్చాయని ఆయన గుర్తుచేశారు. బంగారం, వెండి వంటి విలువైన లోహాలతో పోలిస్తే బిట్‌కాయిన్‌ చాలా ప్రత్యేకమైనదని అన్నారు. అయితే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement