ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచనుందా? | RBI May Hike Interest Rates by 75 Basis Points by Q2 of Next Year | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచనుందా?

Nov 20 2026 10:42 AM | Updated on Nov 20 2026 10:44 AM

RBI May Hike Interest Rates by 75 Basis Points by Q2 of Next Year

వచ్చే ఏడాది తొలి అర్ధభాగం(జనవరి-జూన్‌)లో ఆర్‌బీఐ కఠిన విధానాలకే మొగ్గు చూపవచ్చని గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ గోల్డ్‌మన్‌ శాక్స్‌ తాజాగా పేర్కొంది. పరపతి సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తొలుత 2026 డిసెంబర్‌లో 0.25 శాతంమేర పెంచనున్నట్లు అభిప్రాయపడింది. ఆపై 2027 జనవరి-జూన్‌ మధ్య మరో 0.5 శాతంమేర పెంచేందుకు వీలున్నట్లు అంచనా వేసింది.

వెరసి వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు జూన్‌కల్లా 6.25 శాతానికి బలపడనున్నట్లు పేర్కొంది. పెరుగుతున్న ఆహార ధరలకుతోడు, ఇతర రంగాలలోనూ ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా ఆర్‌బీఐ కఠిన ద్రవ్య విధానాలకు తెరతీయనున్నట్లు ఒక నివేదికలో తెలియజేసింది. దీంతో దేశ రియల్‌ జీడీపీ వృద్ధి తొలుత వేసిన 7.9 శాతం నుంచి తగ్గి 7.2 శాతానికి పరిమితంకావచ్చని అభిప్రాయపడింది.

డిసెంబర్‌ వరకూ రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం ఎగువన కొనసాగనున్నదని, కీలక వస్తువులు, సర్వీసులపైన ఈ ప్రభావం ప్రసరించనున్నట్లు వివరించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో చేపట్టిన పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ దాదాపు నాలుగేళ్ల తదుపరి వడ్డీ రేటును 0.25 శాతంమేర పెంచిన సంగతి తెలిసిందే. ఫలితంగా రెపో రేటు 5.5 శాతానికి చేరుకుంది. 2027లో రిటైల్‌ ధరలు(సీపీఐ) సగటున 5.7 శాతంగా నమోదయ్యే వీలున్నట్లు పేర్కొంది. టోకు ధరలు(డబ్ల్యూపీఐ) 4.7 శాతానికి చేరవచ్చని అంచనా వేసింది. ఇందుకు అధిక ఆహార ధరలు, ప్రతికూల వాతావరణం, ఎల్‌ నినో, ముడివ్యయాలు కారణంకానున్నట్లు వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement