మళ్లీ పేటీఎం వాలెట్‌ సర్వీసులు.. ఆర్బీఐ ఓకే! | Paytm Wallet Services RBI In-Principle Approval | Sakshi
Sakshi News home page

మళ్లీ పేటీఎం వాలెట్‌ సర్వీసులు.. ఆర్బీఐ ఓకే!

Nov 14 2026 6:52 PM | Updated on Nov 14 2026 7:02 PM

Paytm Wallet Services RBI In-Principle Approval

న్యూఢిల్లీ: వాలెట్‌ సర్వీసులను అందించే దిశగా తమ అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్‌ సర్వీసెస్‌ (పీపీఎస్‌ఎల్‌)కి రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి సూత్రప్రాయ అనుమతులు లభించినట్లు వన్‌97 కమ్యూనికేషన్స్‌ వెల్లడించింది. ప్రీపెయిడ్‌ పేమెంట్‌ సాధనాలకు సంబంధించి నవంబర్‌ 13న ఆర్‌బీఐ ఈ మేరకు ఆథరైజేషన్‌ ఇచ్చినట్లు వివరించింది. సైబర్‌ సెక్యూరిటీ సహా సిస్టం ఆడిట్‌ నిర్వహించాల్సిందిగా రిజర్వ్‌ బ్యాంక్‌ సూచించినట్లు తెలిపింది.

ఇది పూర్తయి, తుది అనుమతి లభించిన తర్వాతే పీపీఎస్‌ఎల్‌ ప్రీపెయిడ్‌ పేమెంట్‌ సాధనాలను జారీ చేసేందుకు వీలవుతుందని వన్‌97 కమ్యూనికేషన్స్‌ పేర్కొంది. పేటీఎం 2014లో ప్రారంభించిన వాలెట్‌ వ్యాపారాన్ని 2017లో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌నకు (పీపీబీఎల్‌) బదలాయించింది. అయితే నిబంధనలను పాటించడం లేదనే అరోపణలపై కొత్త డిపాజిట్లు, క్రెడిట్లను స్వీకరించకుండా 2024లో జనవరిలో ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. తదుపరి 2026 ఏప్రిల్‌లో పీపీబీఎల్‌ బ్యాంకింగ్‌ లైసెన్సును రద్దు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement