బ్యాంకు ఖాతా లేకున్నా నగదు బదిలీ | RBI Consolidates Money Transfer Rules Allows Rs 50000 Cash NEFT Transfers | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఖాతా లేకున్నా నగదు బదిలీ

Nov 12 2026 7:14 AM | Updated on Nov 12 2026 7:24 AM

RBI Consolidates Money Transfer Rules Allows Rs 50000 Cash NEFT Transfers

ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరొక ఖాతాకు, లేదా దేశంలోని ఏ వ్యక్తికైనా డబ్బు పంపే నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరళీకరించింది. గుర్తింపు ధ్రువీకరణ, చిరునామా ధ్రువీకరణలాంటివి లేకపోవడం వల్ల బ్యాంకింగ్‌ మాధ్యమాన్ని ఉపయోగించుకోలేని వలస కార్మికుల్లాంటి వారు కూడా నగదును ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు వీలు కల్పిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. 2026 నవంబర్ 11న విడుదల చేసిన ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.

రూ.50,000 వరకు బదిలీ
కొత్త నిబంధనల ప్రకారం.. మీకు ఏ బ్యాంకులోనూ ఖాతా లేకపోయినా, మీరు బ్రాంచ్‌కు వెళ్లి ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా ఎవరి ఖాతాకైనా ఒకేసారి రూ.50,000 వరకు బదిలీ చేసుకోవచ్చు. ఒకవేళా.. మీరు ఎవరికైనా నేరుగా నగదు రూపంలో డబ్బు పంపాలనుకుంటే, ఒకేసారి రూ. 10,000 వరకు పంపవచ్చు, కాగా ఒక వ్యక్తి నెలకు గరిష్టంగా రూ. 25 వేల నగదును పంపవచ్చు.

ఆర్‌బీఐ కొత్త నిబంధనల ప్రకారం.. బ్యాంకు ఖాతాలు ఉన్నవారు సొంతంగా ఖాతా లేని వారికి నేరుగా డబ్బు పంపే సౌకర్యాన్ని బ్యాంకులు ఇకపై కల్పించనున్నాయి. స్వీకర్త ఏదైనా ఏటీఎం నుంచి నగదును తీసుకోవచ్చు లేదా బ్యాంకు ఏజెంట్ (బిజినెస్ కరస్పాండెంట్)ను సంప్రదించవచ్చు. సమీపంలో బ్యాంకు శాఖలు లేని గ్రామాలు, మారుమూల ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఈ సేవ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఒక్కో లావాదేవీకి రూ.5,000 మాత్రమే
బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, ఏటీఎంలు, ఇతర అనుమతించిన మార్గాల ద్వారా డబ్బులు పంపించాలంటే ఒక్కో లావాదేవీకి రూ.5,000 మాత్రమే అనుమతిస్తారు. ఈ విధానంలో ఒక వ్యక్తి నెలకు గరిష్ఠంగా రూ.25,000 వరకు మాత్రమే పంపించగలడు.

ఈ సేవలను ఉపయోగించుకునే కస్టమర్ల వివరాలను బ్యాంకులు తప్పనిసరిగా నమోదు చేయాలి. రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన కేవైసీ నిబంధనల ప్రకారం.. కస్టమర్ వివరాలను పరిశీలించాలి. అంతేకాకుండా ప్రతి లావాదేవీకి అదనపు భద్రతా ధృవీకరణ తప్పనిసరిగా ఉండాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement