వచ్చే జనవరి 1 నుంచి చెక్కులు చెల్లవా? ఆర్బీఐ క్లారిటీ | Will cheques invalid January 1 check truth RBI cheque book rules | Sakshi
Sakshi News home page

వచ్చే జనవరి 1 నుంచి చెక్కులు చెల్లవా? ఆర్బీఐ క్లారిటీ

Nov 8 2026 3:27 PM | Updated on Nov 8 2026 3:34 PM

Will cheques invalid January 1 check truth RBI cheque book rules

పాత చెక్‌బుక్‌లతో లావాదేవీలు ఇకపై చేయలేరా? రూ.50 వేలకుపైగా చెక్కులు చెల్లవా? ఈ మేరకు సందేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టత ఇచ్చింది. కొత్త చెక్‌బుక్‌లు తప్పనిసరి అంటూ జరుగుతున్న ప్రచారాన్ని పూర్తిగా ఖండించింది. దీంతో బ్యాంకు ఖాతాదారులకు ఊరట లభించింది.

జనవరి 1, 2027 నుంచి దేశంలో కొత్త చెక్‌బుక్ నిబంధనలు అమల్లోకి వస్తాయంటూ వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఆర్బీఐ స్పందించింది. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (CTS) చెక్‌బుక్‌ల విషయంలో ఎలాంటి కొత్త మార్పులు తీసుకురావడం లేదని వెల్లడించింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న సమాచారం వాస్తవ విరుద్ధమైనదని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని పేర్కొంది.

అసలా సందేశంలో ఏముందంటే..

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సందేశాల ప్రకారం.. ప్రస్తుతం వినియోగిస్తున్న సీటీఎస్ చెక్‌బుక్‌ల గడువు డిసెంబర్ 31, 2026తో ముగియనుంది. జనవరి 1, 2027 నుంచి కొత్త భద్రతా ప్రమాణాలతో కూడిన చెక్‌బుక్‌లను మాత్రమే బ్యాంకులు అంగీకరిస్తాయని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, రూ.50,000 కంటే ఎక్కువ విలువ కలిగిన పాత చెక్కులను కూడా బ్యాంకులు స్వీకరించవని ఈ సందేశాల్లో పేర్కొన్నారు. ఖాతాదారులు తమ పాత చెక్‌బుక్‌లను మార్చుకుని కొత్త వాటి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

అయితే, ఈ ప్రచారంలో వాస్తవం లేదని ఆర్బీఐ తేల్చిచెప్పింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న సీటీఎస్ చెక్‌బుక్‌లకు సంబంధించి కొత్త నిబంధనలేవీ తీసుకురావడం లేదని స్పష్టం చేసింది. రూ.50 వేలకుపైగా ఉన్న పాత చెక్కులను తిరస్కరిస్తారనే ప్రచారం కూడా నిరాధారమైనదేనని వివరించింది.

ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా స్పందించింది. జనవరి 1, 2027 నుంచి కొత్త చెక్‌బుక్ నిబంధనలు అమల్లోకి వస్తాయనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని వెల్లడించింది. ఆర్బీఐ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: HDFC బ్యాంక్ గుడ్‌న్యూస్‌.. ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంపు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement