విజయవాడ: విజయవాడలోని యూకో బ్యాంక్ జోనల్ కార్యాలయంలో దీపావళి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కార్యాలయాన్ని విద్యుద్దీపాలు, పూలతో అందంగా అలంకరించి పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.
ఈ వేడుకల్లో జోనల్ హెడ్‌తో పాటు బ్యాంకు అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉద్యోగులందరూ పరస్పరం దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా జోనల్ హెడ్ మాట్లాడుతూ.., దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు, సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు. బ్యాంకు ఖాతాదారులు, వినియోగదారులు, శ్రేయోభిలాషులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు బ్యాంకు ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. ఈ వేడుకల్లో జోనల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


