వచ్చే నెల(డిసెంబర్)లో చేపట్టనున్న పాలసీ సమీక్షలో భాగంగా ఆర్‌బీఐ రెపో రేటును 0.25 శాతమే తగ్గించవచ్చని ఎస్‌బీఐ ఎకనమిక్ రీసెర్చ్ విభాగం అంచనా వేసింది. తొలుత వేసిన 0.5 శాతం పెంపు అంచనాలను తాజాగా సవరించింది. ఇందుకు మెరుగుపడిన విదేశీ పరిస్థితులు, విదేశీ ఫండ్ల పెట్టుబడులు, రూపాయి పుంజుకోవడం తదితర సానుకూల అంశాలను ఎస్‌బీఐ రీసెర్చ్ ఆర్థికవేత్తలు ప్రస్తావించారు.
అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం తాజాగా ఆర్‌బీఐ పరిమితి 6 శాతాన్ని దాటిన నేపథ్యంలో ఎస్‌బీఐ ఆర్థికవేత్తల అంచనాలు వెలువడటం గమనార్హం! డిసెంబర్‌లో చేపట్టనున్న రెపో రేటు పెంపు ప్రస్తుత సైకిల్‌లో చివరిదని చెప్పేందుకు 50:50 అవకాశాలున్నట్లు ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక అభిప్రాయపడింది. అక్టోబర్ సమీక్షలో ఆర్‌బీఐ రెపో రేటును 0.25 శాతం పెంచడంతో 5.5 శాతానికి చేరిన విషయం విదితమే.


