breaking news
rate of interest
-
అప్పు తీసుకునే వారు చూస్తున్నదేమిటి?
వడ్డీ ఎంత అన్నది. కరెక్టేనా? ఊహూ కాదంటోంది పైసాబజార్. పండుగ రుణాలు తీసుకునేటప్పుడు మనోళ్లు.. అంటే దక్షిణాది రాష్ట్రాల వాళ్లు వడ్డీ రేట్ల కంటే.. ఎంత వేగంగా రుణం వస్తుంది? డిజిటల్ సౌకర్యం ఉందా? లేదా? అన్నదానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారట. ఇదేమీ ఒట్టి మాటేమీ కాదండోయ్. సర్వే చేసి మరీ నిర్ణయించామని చెబుతోంది ఆ సంస్థ. వివరాలు ఇలా ఉన్నాయి..ఈ రోజుల్లో అప్పు చేయకుండా ఉండటం అన్నది చాలామందికి అసాధ్యం. పండగ షాపింగ్ కావచ్చు. ఇంట్లో చిన్న చిన్న మరమ్మతులు కావచ్చు.. అన్ని సందర్భాల్లోనూ మన సేవింగ్స్ మాత్రమే అక్కరకు రావు. చేబదులు లేదా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో రుణాలు తీసుకోక తప్పని పరిస్థితి. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో అప్పుకు ఈ మూడే ప్రధాన కారణాలని పైసాబజార్ సర్వే చెబుతోంది. సర్వే చేసిన వారిలో సుమారు 33 శాతం మంది రూ.మూడు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకూ అప్పు చేశారని, వీరు వడ్డీ రేట్ల కంటే డిజిటల్ ఎక్స్పీరియన్స్, ప్రాసెస్ వేగాలను ఆధారంగా చేసుకుని ఏ సంస్థ నుంచి రుణం తీసుకోవాలో నిర్ణయించుకుంటున్నారని ఈ సర్వే ద్వారా తెలిసింది.దక్షిణాది రాష్ట్రాల్లోని సుమారు 18 పట్టణాల్లో 1700 మందిని ప్రశ్నించి సిద్ధం చేశారీ సర్వేను. అడక్కుండానే మన ఆర్థిక స్థితిగతులు, పరపతులకు తగ్గట్టుగా లభించే ప్రీఅప్రూవ్డ్, ఇన్స్టంట్ లోన్లు మేలని సర్వే చేసిన వారిలో 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. లోన్ ప్రాసెస్ మొత్తం చిట్టీలు, అకౌంట్ పుస్తకాల్లో కాకుండా డిజిటల్ పద్ధతిలో ఉంటే ఇష్టమని 24 శాతం చెబితే.. కేవలం 20 శాతం మంది మాత్రమే వడ్డీ రేట్లు ఎక్కువ తక్కువ ఉంటే అక్కడ రుణాలు తీసుకునేందుకు ఇష్టపడతామని చెప్పడం గమనార్హం. ఇంకో విషయం సర్వే చేసిన వాళ్లలో ఏకంగా 80 శాతం మంది మొత్తం ప్రాసెస్‌ను పద్ధతిగా వివరించే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై రుణం తీసుకునేందుకు మక్కువ చూపారు.అవసరం ఏమిటి? మొత్తం ఎంత?ముందుగా చెప్పుకున్నట్లు అత్యధిక శాతం మంది.. స్పష్టంగా చెప్పాలంటే 39 శాతం మంది హోమ్ రెనవేషన్ కోసమే అప్పు చేస్తున్నట్లు ఈ సర్వే ద్వారా స్పష్టమైంది. రుణాల సర్దుబాటు కోసం కొత్త రుణం చేస్తున్న వారు 27 శాతం మంది ఉంటే.. పండుగ షాపింగ్, పెట్టుపోతల వంటి వాటి కోసం అప్పు చేస్తున్న వారు 14 శాతం మంది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, బంగారం కొనుగోళ్లకు అప్పులు చేస్తున్న వాళ్లు వరుసగా 12 శాతం, 10 శాతం ఉన్నట్లు స్పష్టమైంది.సుమారు 35 శాతం మంది మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ అప్పు చేస్తుంటే.. 22 శాతం మంది తాలూకూ మొత్తాలు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకూ మాత్రమే ఉన్నట్లు ఈ సర్వేలో తెలిసింది. కేవలం 14 శాతం మంది మాత్రమే పది లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అప్పు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం సమాజంలో చాలామంది కేవలం అత్యవసరాల కోసం మాత్రమే కాకుండా.. లైఫ్‌స్టైల్ కోసం, ఆశలు నెరవేర్చుకునేందుకు కూడా అప్పులు చేస్తున్నారని ఈ సర్వే నిర్వహించిన పైసా బజార్ సీఈవో సంతోశ్ అగర్వాల్ తెలిపారు. రుణ వ్యవస్థ మెరుగైన పనితీరుకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. -
రిటైల్ డిపాజిట్లపై నెగటివ్ రిటర్న్స్!
ముంబై: ధరల పెరుగుదల స్పీడ్ (ద్రవ్యోల్బణాన్ని) పరిగణనలోకి తీసుకుంటే రిటైల్ డిపాజిటర్లకు తమ డిపాజిట్లపై ప్రస్తుతం నెగటివ్ రిటర్న్స్ అందుతున్నాయని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆర్థికవేత్తల నివేదిక ఒకటి పేర్కొంది. ఈ నేపథ్యంలో వడ్డీ ఆర్జనలపై పన్ను అంశాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని తన తాజా నివేదికలో సూచించింది. ఈ మేరకు సౌమ్య కాంతి ఘోష్ నేతృత్వంలోని ఆర్థికవేత్తలు సమర్పించిన ఒక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ►డిపాజిటర్ల అందరి గురించీ ఆలోచించక పోయినా, కనీసం సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై పన్ను భారాన్ని తగ్గించే అంశాన్ని అయినా సమీక్షించాలి. వారి రోజూవారీ అవసరాలు, వ్యయాలు ఈ వడ్డీపైనే ఆధారపడే సంగతి తెలిసిందే. మొత్తం డిపాజిట్లు దాదాపు రూ. 156 లక్షల కోట్లు. ఇందులో రిటైల్ డిపాజిట్ల వాటా దాదాపు రూ.102 లక్షల కోట్లు. ►ప్రస్తుతం,డిపాజిటర్లందరికీ సంవత్సరానికి రూ.40,000 కంటే ఎక్కువ వడ్డీ ఆదాయాన్ని జమ చేసే సమయంలో బ్యాంకులు మూలం వద్ద పన్నును మినహాయించుకుంటాయి, అయితే సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి ఆదాయం రూ .50,000 దాటితే పన్ను భారం పడుతుంది. ►వృద్ధే ప్రధాన లక్ష్యంగా దేశం ప్రస్తుతం సరళతర వడ్డీరేట్ల విధానాన్ని అవలంభిస్తోంది. దీనితో డిపాజిట్ రేట్ల కనీస స్థాయికి పడిపోయి, కేవలం దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నవారికి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. రెపో వరుసగా ఏడు త్రైమాసికాల నుంచి 4 శాతంగా కొనసాగుతోంది. ►వడ్డీరేట్లు ఇప్పట్లో పెరిగే అవకాశాలు కనిపించడంలేదు. బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) భారీగా కొనసాగుతుండడం ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సిన అంశం. ►ప్రస్తుతం ఫైనాన్షియల్ మార్కెట్లో బుల్‌రన్ నడుస్తోంది. ఇది డిపాజిటర్ల ఆలోచనా ధోరణిని మార్చే అవకాశం ఉంది. తమ పెట్టుబడికి తగిన రిటర్న్స్ సంపాదించడానికి వారు మార్కెట్‌వైపు చూసే అవకాశాలు ఉన్నాయి. ►వ్యవస్థలో అధిక ద్రవ్య లభ్యత, వడ్డీరేట్ల విషయంలో పోటీతత్వం, నిధుల సమీకరణ వ్యయాల సమతౌల్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, బ్యాంకులు ప్రస్తుతం మార్జిన్ల ఒత్తిడులను ఎదుర్కొంటున్నాయి. -
‘ఫిక్స్’ చేసేశారు
కోర్టు లిక్విడేటర్నే బురిడీ కొట్టించిన వైనం మల్కాజిగిరి ఎస్బీహెచ్ నుంచి తొమ్మిది కోట్లు గల్లంతు అన్నోజిగూడలోనూ రూ.18 కోట్ల మోసం ఇతర ప్రభుత్వ ఖాతాల డబ్బులపై పోలీసుల ఆరా సిటీబ్యూరో/మల్కాజిగిరి : బ్యాంకుల్లో ఉన్న ప్రభుత్వ విభాగాలకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లపై మాయగాళ్లు కన్నేశారు. గతంలో ఇంటర్మీడియట్ బోర్డుకు చెందిన రూ. మూడు కోట్ల ఫిక్స్డ్ డబ్బులను కాజేసిన తరహలోనే తాజాగా మల్కాజిగిరిలోని ఎస్బీహెచ్లో ఖాయిలాపడ్డ పరిశ్రమలకు సంబంధించిన దాదాపు రూ.తొమ్మిది కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను తన్నుకుపోయారు. వివరాల్లోకి వెళితే.. ఖాయిలాపడ్డ పరిశ్రమలకు సంబంధించిన ఓ కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతుండంతో కోర్టు ఆదేశాల ప్రకారం కోర్టు లిక్విడేటర్ ఇందుకు సంబందించిన లావాదేవీలు చూస్తున్నాడు. ఇదిలా ఉండగా నగరంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో సదరు శాఖకు సంబంధించిన దాదాపు రూ.తొమ్మిది కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న బ్యాంక్ మాజీ ఉద్యోగి రమణ కోర్టు లిక్విడేటర్‌ను కలిసి, మల్కాజిగిరిలోని ఎస్బీహెచ్ బ్యాంక్‌లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని నమ్మించాడు. ఆ తర్వాత రమణ మల్కాజిగిరి ఎస్బీహెచ్ బ్యాంక్ మేనేజర్ వద్దకు వెళ్లి ఫలానా వ్యక్తిని కలిస్తే ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు వస్తాయని చెప్పాడు. దీంతో ఆ తర్వాత రమణ కోర్టు లిక్విడేటర్‌ను కలవడంతో ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ పేపర్లు ఇచ్చాడు. వాటిని తీసుకొని బ్యాంక్ మేనేజర్‌కు ఇవ్వగా ఖాతాలో డిపాజిట్ చేశారు. అందుకు అతను ఇచ్చిన రసీదులను కలర్ జిరాక్స్ తీయించి, నకిలీవి కోర్టు లిక్విడేటర్‌కు ఇచ్చి అసలువి తన దగ్గరే ఉంచుకున్నాడు. పది రోజుల తర్వాత మల్కాజిగిరి ఎస్బీహెచ్ బ్రాంచ్ మేనేజర్‌ను కలిసి డబ్బులను ఇతర బ్రాంచ్‌లకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నట్లు చెప్పి ఖాతాదారుల తరఫున లెటర్ రాసి ఇచ్చాడు. దీంతో మేనేజర్ రమణ సూచించినట్లుగానే బాంబే, రాజ్‌కోట్, చెన్నై తదితర నగరాల్లోని బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశారు. ఇలా వెలుగులోకి వచ్చింది... ఇదిలా ఉండగా ఖమ్మంలో ప్రభుత్వ విభాగానికి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో మోసం జరిగిందని బయటపడటంతో అనుమానం వచ్చిన కోర్టు లిక్విడేటర్ మల్కాజిగిరి ఎస్బీహెచ్ బ్యాంక్ అధికారులకు ఫోన్ చెయ్యగా ఇప్పటికే ఆ డబ్బులను ఇతర ఖాతాలకు మళ్లించినట్లు తెలిపారు. దీంతో అతను మల్కాజిగిరి పోలీసులను ఆశ్రయించడంతో సూత్రధారి రమణను అదుపులోకి తీసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్నోజిగూడలోనూ... ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే అన్నోజిగూడ సింగపూర్ టౌన్షిప్ ఎస్బీహెచ్ బ్యాంక్‌లో రూ. 18 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఇతర ఖాతాలకు మళ్లినట్లు తెలిసింది. ఈ నిధులు ఆంధ్రప్రదేశ్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌కు చెందినవిగా గుర్తించారు. ఇవేకాక ఇతర బ్యాంక్‌ల్లోనూ ప్రభుత్వ విభాగాల ఫిక్స్డ్ ఖాతాలు తరలించి ఉంటారని భావిస్తున్న పోలీసులు కేసును సీఐడీకి అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. -
ఎస్బీహెచ్ డిపాజిట్ పథకానికి అనూహ్య స్పందన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ‘ఎస్బీహెచ్-150 రోజులు’ పేరుతో ప్రవేశపెట్టిన పరిమిత కాల డిపాజిట్ పథకానికి అనూహ్య స్పందన లభించింది. కేవలం పది రోజుల్లో ఈ పథకం ద్వారా రూ. 1,500 కోట్లకు పైగా డిపాజిట్లను సేకరించినట్లు ఎస్బీహెచ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎం. భగవంతరావు ‘సాక్షి’కి తెలిపారు. డిమాండ్ బాగుండటంతో ఈ పథకాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించుతున్నట్లు తెలిపారు. కేవలం 150 రోజుల కాల పరిమితి గల ఈ డిపాజిట్ పథకంపై ఎస్బీహెచ్ 9.15 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. డిసెంబర్ 9న ప్రవేశపెట్టిన ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడానికి తొలుత డిసెంబర్ 31 చివరి తేదీ అని ప్రకటించినా ఇప్పుడు దీన్ని మరో నెల రోజులు పొడిగించారు. ఈ పథకంలో ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) కూడా ఇన్వెస్ట్ చేయచ్చు.


