వడ్డీ వస్తుందా.. అందుకేనా స్విస్ బ్యాంక్‌లో డబ్బు! | How Much Interest Can Be Earned by Keeping Money in Swiss Banks | Sakshi
Sakshi News home page

వడ్డీ వస్తుందా.. అందుకేనా స్విస్ బ్యాంక్‌లో డబ్బు!

Jan 19 2026 5:12 PM | Updated on Jan 19 2026 5:30 PM

How Much Interest Can Be Earned by Keeping Money in Swiss Banks

చాలామంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు మొదలైన సంపన్నులు.. వారి అపార సంపదను (డబ్బు) స్విస్ బ్యాంకులో దాచుకుంటారని చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ఇక్కడ డబ్బు దాచుకుంటారు సరే.. ఈ డబ్బుకు వడ్డీ వస్తుందా?, వస్తే ఎంత వస్తుంది? అనే ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

వడ్డీ వస్తుందా?
స్విస్ బ్యాంక్ అనేది.. గోప్యత, భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది. అయితే ఇక్కడ ఎవరైనా డబ్బు దాచుకుంటే, సాధారణ బ్యాంకుల మాదిరిగా చెప్పుకోదగ్గ వడ్డీ అయితే రాదు. చాలా తక్కువ మొత్తంలో వడ్డీ వస్తుంది. ఇతర బ్యాంకుల్లో మాదిరిగానే.. సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్, ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్‌లపై వడ్డీ లభిస్తుంది.

నిజానికి.. పెద్ద మొత్తంలో డబ్బు స్విస్ బ్యాంక్‌లో ఉంచితే వడ్డీ రావడం కంటే, బ్యాంక్ ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. కాబట్టి స్విస్ బ్యాంకులో ఖాతాలు తెరవడం ప్రధానంగా.. వడ్డీ కోసం కాకుండా డబ్బు భద్రత & స్థిరత్వం కోసం చేస్తారు.

స్విస్ బ్యాంక్‌లో ఖాతా సులభమేనా?
స్విస్ బ్యాంక్‌లో ఖాతా తెరవడం అంత సులభం కాదు. కనీస డిపాజిట్‌గా కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. అదనంగా, ఖాతా నిర్వహణకు సంవత్సరానికి భారీ ఫీజులు కూడా వసూలు చేస్తారు. ఈ కారణాల వల్ల సాధారణ మధ్యతరగతి వ్యక్తులకు స్విస్ బ్యాంక్ ఖాతాలు సాధ్యపడవు.

కీలకమైన మార్పులు!
ఇక తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఒకప్పుడు స్విస్ బ్యాంక్ అంటేనే పూర్తి గోప్యతకు ప్రతీకగా భావించేవారు. స్విస్ బ్యాంక్‌లో డబ్బు ఉంటే ఎవరికీ తెలియదు అనే నమ్మకం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉండేది. ముఖ్యంగా పన్ను ఎగవేత, అక్రమ సంపద వంటి విషయాల్లో స్విస్ బ్యాంకుల పేరు తరచూ వినిపించేది. కానీ కాలం మారడంతో పాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కూడా భారీ మార్పులు వచ్చాయి. దాంతో స్విస్ బ్యాంకుల గోప్యత విధానంలో కూడా కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి.

ఇప్పుడు స్విస్ బ్యాంకులు ఖాతాదారుల వివరాలను ఇతర దేశాలతో పంచుకుంటున్నాయి. అయితే ఇది యథేచ్ఛగా కాదు, కొన్ని నియమాలు & అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారమే జరుగుతోంది. ఈ మార్పుకు ప్రధాన కారణం అంతర్జాతీయ ఒత్తిడి. ప్రపంచ దేశాలు పన్ను ఎగవేత, బ్లాక్ మనీ, ఉగ్రవాద నిధులు, మనీలాండరింగ్ వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో OECD (ఆర్థిక సహకార మరియు అభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో CRS (కమాండ్ రిపోర్టింగ్ స్టాండర్డ్) అనే విధానం అమల్లోకి వచ్చింది.

ఇదీ చదవండి: సిల్వర్ కొత్త మార్క్.. చరిత్రలో తొలిసారి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement