ఉద్యోగం చేసే దాదాపు అందరికీ పీఎఫ్ వస్తుంది. జాబ్ మానేసిన తరువాత ఆగిపోతుంది. అయితే ఉద్యోగం మానేశాక కూడా వడ్డీ వస్తుందా?, వస్తే ఎన్ని సంవత్సరాలు వస్తుందో.. బహుశా చాలామందికి తెలుసుకుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.
ఒక ఉద్యోగి తాను చేస్తున్న ఉద్యోగం ఆపేశాక కూడా పీఎఫ్ బ్యాలెన్స్‌కు వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN)కు లింక్ చేసిన తరువాత, మీరు ఉద్యోగం మారినా.. మానేసినా వడ్డీ ఆగిపోదు. సుమారు 58 ఏళ్లు వచ్చే వరకు లేదా మీకై మీరు విత్‌డ్రా చేసుకునే వరకు వడ్డీ జమ అవుతూనే ఉంటుంది.
ఉద్యోగం మానేసిన రెండు నెలలు పూర్తయ్యాక, పీఎఫ్ మొత్తాన్ని తీసుకునే అర్హత పొందుతారు. కేవైసీ (ఆధార్, పాన్, బ్యాంక్) వివరాలు లింక్ అయి ఉంటే.. వడ్డీ క్రెడిట్ / విత్‌డ్రా సులభంగా జరుగుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి.. ప్రభుత్వం EPF వడ్డీ రేటును 8.25 శాతంగా నిర్ధారించింది.


