దిగ్గజ బ్యాంకులో డేటా లీక్ కలకలం! | JPMorgan Says 3rd Party Vendors Targeted in Cyberattack and Data Exposed | Sakshi
Sakshi News home page

దిగ్గజ బ్యాంకులో డేటా లీక్ కలకలం!

Nov 20 2026 7:49 AM | Updated on Nov 20 2026 8:02 AM

JPMorgan Says 3rd Party Vendors Targeted in Cyberattack and Data Exposed

అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థ జేపీమోర్గాన్ చేజ్ (JPMorgan Chase).. ఇటీవల ఒక సైబర్ దాడికి గురైంది. ఈ దాడిలో బ్యాంకుకు సేవలు అందించే థర్డ్ పార్టీ సంస్థల వద్ద ఉన్న కొంతమంది ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం బయటకు లీక్ అయినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి.

సుమారు 16,000 మంది సంపన్న ఖాతాదారులకు సంబంధించిన ఇమెయిల్ అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు, అకౌంట్ ఐడీలు వంటి సమాచారం బయటపడినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ ఘటన ప్రపంచ ఆర్థిక రంగంలో సైబర్ భద్రతపై మరోసారి ఆందోళన కలిగించింది.

ఈ సైబర్ దాడి నేరుగా జేపీమోర్గాన్ బ్యాంకు ప్రధాన వ్యవస్థపై కాకుండా.. బ్యాంకుకు సేవలు అందించే థర్డ్ పార్టీ సంస్థలపై జరిగింది. ఈ సంస్థల వద్ద కస్టమర్లకు సంబంధించిన మార్కెటింగ్ సమాచారాన్ని.. హ్యాకర్లు హ్యాక్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది.

జేపీమోర్గాన్ స్పందన
ఈ ఘటనపై జేపీమోర్గాన్ చేజ్ స్పందిస్తూ.. తమ బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగలేదని స్పష్టం చేసింది. ప్రభావితమైన కస్టమర్లను అవసరమైన సందర్భాల్లో నేరుగా సంప్రదించి, ఉచిత క్రెడిట్ మానిటరింగ్ వంటి సహాయాన్ని అందిస్తామని ప్రకటించింది. అంతే కాకుండా.. కస్టమర్ల భయపడాల్సిన పనిలేదని హామీ ఇచ్చింది. ఈ వారం ప్రారంభంలో కొంతమంది కస్టమర్లు ఎదుర్కొన్న సేవా అంతరాయానికి దీనికి ఎటువంటి సంబంధం లేదని కూసే బ్యాంక్ స్పష్టం చేసింది.

కాగా.. ఈ సైబర్ దాడికి కొన్ని రోజుల ముందు జేపీమోర్గాన్ చేజ్ మాత్రమే కాకుండా.. ఇతర బ్యాంకుల్లో కూడా సాఫ్ట్‌వేర్ బగ్ కారణంగా లావాదేవీలను ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే.. ఈ రెండు ఘటనలకు ఎలాంటి సంబంధం లేదని జేపీమోర్గాన్ స్పష్టం చేసింది.

జేపీమోర్గాన్ సైబర్ దాడిని పక్కనపెడితే.. ఇటీవల ఎఫ్ఏఏ విమానయాన సేవల్లో అంతరాయాలు, మైక్రోసాఫ్ట్ ఈమెయిల్ సేవల్లో సమస్యలు, వివిధ వెబ్‌సైట్లలో మాల్వేర్ దాడులు వంటి ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి.

ఇదీ చదవండి: బైక్ నుంచి కిందపడినా.. ప్రాణాలు సేఫ్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement