హెల్త్‌ సప్లిమెంట్స్‌ మార్కెట్‌ రెట్టింపు  | India health supplements market at 5. 3 Bn dollars in FY2026 | Sakshi
Sakshi News home page

హెల్త్‌ సప్లిమెంట్స్‌ మార్కెట్‌ రెట్టింపు 

Nov 20 2026 3:43 AM | Updated on Nov 20 2026 3:43 AM

India health supplements market at 5. 3 Bn dollars in FY2026

2030–31 నాటికి 9.4 బిలియన్‌ డాలర్లకు చేరిక 

ప్రస్తుతం 5.3 బిలియన్‌ డాలర్ల స్థాయిలో పరిశ్రమ 

రెడ్‌సీర్‌ నివేదిక

న్యూఢిల్లీ: దేశీయంగా హెల్త్‌ సప్లిమెంట్స్‌ మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోంది. 2031 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రస్తుత స్థాయికి దాదాపు రెట్టింపై 9.4 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇది 5.3 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. రెడ్‌సీర్‌ స్ట్రాటెజీ కన్సల్టెంట్స్‌ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కోవిడ్‌ అనంతరం ఆరోగ్యంపై అవగాహన పెరగడం, సోషల్‌ మీడియా కంటెంట్, ఫార్మాట్లలో మార్పులు రావడం (గమ్మీల్లాంటి ఉత్పత్తులు), డిజిటల్‌ కామర్స్‌ పెరగడం తదితర అంశాలతో ఈ మార్కెట్లో మార్పులు చోటు చేసుకున్నాయి. 

ఔషధంగా తీసుకోవడానికే పరిమితం కాకుండా అనారోగ్యాల బారిన పడకుండా, ఆరోగ్యంగా ఉండేందుకు కూడా వీటిని తీసుకునే ధోరణి పెరుగుతోంది. ప్రొటీన్, స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌ ఉత్పత్తులు ఏటా 19 శాతం, స్పెషాలిటీ బయో–యాక్టివ్స్‌ ఉత్పత్తులు 16 శాతం విస్తరిస్తూ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగాలుగా నిలుస్తున్నాయి. 

ఇండొనేíÙయా, చైనా, అమెరికాతో పోలిస్తే భారత్‌లో సప్లిమెంట్‌ల తలసరి వినియోగం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ మార్కెట్‌ మరింత విస్తరించేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని రెడ్‌సీర్‌ పేర్కొంది. మిగతా ఉత్పత్తులతో పోలిస్తే సప్లిమెంట్ల విభాగం విభిన్నంగా ఉంటుందని సంస్థ పార్ట్‌నర్‌ కుషాల్‌ భట్నాగర్‌ తెలిపారు. ఆరోగ్యకరమైన ఉత్పత్తుల కోసం కొనుగోలుదారులు ముందుగా ఒక బ్రాండ్‌ వైపు ఆకర్షితులైనా, తదుపరి రోజుల్లో వారు ఎంత వరకు దానితోనే కొనసాగుతారనేది కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు.  

నివేదికలో మరిన్ని విశేషాలు.. 
→ సప్లిమెంట్ల కొనుగోళ్లకు సంబంధించి ఆన్‌లైన్‌ మాధ్యమం వాటా ప్రస్తుతం 19%గా ఉండగా 2031 ఆర్థిక సంవత్సరం నాటికి 40–50 శాతానికి చేరనుంది. 
→ డిజిటల్‌ నేటివ్‌ బ్రాండ్ల (డీఎన్‌బీ) వాటా మూడింట ఒక వంతుగా ఉంటుంది.  
→ ప్రొటీన్, మల్టీవిటమిన్స్‌ విభాగం 3.5–4 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చు. క్రియాటిన్, ఒమేగా–3లాంటి ఉత్పత్తుల విభాగం 2.8– 3.3 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చు. అలాగే, బరువు నియంత్రణ, మహిళల ఆరోగ్య సంరక్షణ తదితర ఉత్పత్తుల విభాగం 1.3–1.8 బిలియన్‌ డాలర్ల స్థాయికి వృద్ధి చెందవచ్చు. 
→ అనుబంధ ఫుడ్‌–బెవరేజ్, సౌందర్య సాధనాలు, వ్యక్తిగత సంరక్షణ సాధనాల కేటగిరీలను కూడా పరిగణనలోకి తీసుకుంటే మార్కెట్‌ 100–125 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement