పసిడి ధరల ఢమాల్‌! పది రోజుల్లో రూ.12 వేలు.. | Gold Rate Collapses Rs 12000 in 10 Days | Sakshi
Sakshi News home page

పసిడి ధరల ఢమాల్‌! పది రోజుల్లో రూ.12 వేలు..

Nov 19 2026 9:47 PM | Updated on Nov 19 2026 9:49 PM

Gold Rate Collapses Rs 12000 in 10 Days

దేశీయ బంగారం మార్కెట్‌లో ధరల పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ పరిణామాలు పసిడి ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా డాలర్ బలపడటం, ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరగడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు బంగారంపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో భారత్‌లోనూ పసిడి ధరలు భారీగా తగ్గుతున్నాయి. నవంబర్ 19న ఒక్కరోజే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.2,570 తగ్గింది.

10 రోజుల్లో రూ.12 వేల పతనం

నవంబర్ 10న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,690గా ఉండగా, నవంబర్ 19 నాటికి రూ.1,30,690కి పడిపోయింది. అంటే కేవలం పది రోజుల్లోనే రూ.12,000 తగ్గింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,30,800 నుంచి రూ.1,19,800కి దిగివచ్చింది. నవంబర్ 10 నుంచి 19 మధ్య పది రోజుల్లో ఎనిమిది రోజులు బంగారం ధరలు తగ్గడం గమనార్హం. నవంబర్ 14న మాత్రమే స్వల్పంగా పెరగ్గా, 15న స్థిరంగా ఉన్నాయి. నవంబర్ 18, 19 తేదీల్లో వరుసగా రూ.2,780, రూ.2,570 చొప్పున భారీ తగ్గుదల నమోదైంది.

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ భారీ పతనం

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ బంగారం ధర 14 నెలల కనిష్ఠానికి పడిపోయింది. నవంబర్ 19న ఒక దశలో ఔన్సుకు 3,693 డాలర్లకు చేరింది. అమెరికా డాలర్ 19 నెలల గరిష్ఠ స్థాయికి బలపడటం, ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరగడం పసిడి ధరల పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. మరోవైపు స్పాట్ వెండి ధర కూడా ఔన్సుకు 44.88 డాలర్లకు పడిపోయింది.

వడ్డీ రేట్ల పెంపు భయాలు

అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలకు మించి కొనసాగుతుండటంతో ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి. డిసెంబర్‌లో 0.25 శాతం వడ్డీ రేట్ల పెంపునకు దాదాపు 90 శాతం అవకాశాలున్నాయని మార్కెట్ అంచనాలు సూచిస్తున్నాయి. వడ్డీ ఆదాయం లభించని బంగారం వంటి పెట్టుబడులపై ఆసక్తి తగ్గడానికి అధిక వడ్డీ రేట్లు కారణమవుతాయి. ఫలితంగా పెట్టుబడిదారులు బంగారం నుంచి ఇతర ఆస్తుల వైపు మళ్లుతున్నారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరల పతనం ఈ కింద చూడొచ్చు...

gold1
1/6

gold2
2/6

gold3
3/6

gold4
4/6

gold5
5/6

gold6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement