బంగారం తగ్గిందోచ్.. ఒక్కరోజే రూ.2800 డౌన్! | Gold Rate Down in India Know The Details | Sakshi
Sakshi News home page

బంగారం తగ్గిందోచ్.. ఒక్కరోజే రూ.2800 డౌన్!

Nov 19 2026 6:54 AM | Updated on Nov 19 2026 6:55 AM

Gold Rate Down in India Know The Details

బంగారం ధరల పతనం కొనసాగుతూనే ఉంది. బుధవారం.. అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో దేశీయంగా పసిడి ధరలు వరుసగా ఏడో సెషన్‌లోను తగ్గాయి.

ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో బుధవారం 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 2,800 క్షీణించి రూ. 1,35,800కి క్షీణించింది. అటు వెండి కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. కేజీ వెండి ధర మరో రూ. 5,000 క్షీణించి రూ. 1,64,500కి పడిపోయింది.

అంతర్జాతీయంగా స్పాట్‌ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 78.71 డాలర్లు (2%) తగ్గి 3,770.54 డాలర్లకు, వెండి 3% క్షీణించి 45.86 డాలర్లకు చేరాయి. వెండి రేటు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో.. కేజీ సిల్వర్ రేటు 1.85 లక్షల రూపాయల వద్దకు చేరింది.

ఇదీ చదవండి: క్రెడిట్ కార్డులతో జాగ్రత్త.. కియోసాకి హెచ్చరిక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement