‘మేఘా’ విలువ @ లక్ష కోట్లు  | MEIL Group raises 700 million Dollars from global investors | Sakshi
Sakshi News home page

‘మేఘా’ విలువ @ లక్ష కోట్లు 

Nov 19 2026 4:56 AM | Updated on Nov 19 2026 4:56 AM

MEIL Group raises 700 million Dollars from global investors

700 మిలియన్‌ డాలర్ల సమీకరణ 

ఇన్వెస్ట్‌ చేసిన 3 దిగ్గజ సంస్థలు

న్యూఢిల్లీ: ఇన్‌ఫ్రా దిగ్గజం మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ (ఎంఈఐఎల్‌) గ్రూప్‌ భారీ ఎత్తున నిధుల సమీకరణతో దాదాపు రూ. 1 లక్ష కోట్ల వేల్యుయేషన్‌ అందుకుంది. ఈ వేల్యుయేషన్‌తో తాజాగా అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి సుమారు 700 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 6,580 కోట్లు) నిధులు సమీకరించింది. రహదారి ప్రాజెక్టుల మానిటైజేషన్‌ ప్రణాళికలు, ఈక్విటీ ఫైనాన్సింగ్‌ రూపంలో ఈ మొత్తాన్ని సేకరించింది. 

డీకే, హెచ్‌హెచ్, వర్డే పార్ట్‌నర్స్‌లాంటి మూడు అంతర్జాతీయ దిగ్గజ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు ఇన్వెస్ట్‌ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎంఈఐఎల్‌ వేల్యుయేషన్‌ను దాదాపు రూ. 1 లక్ష కోట్లుగా, అనుబంధ సంస్థ ఈపీటీఎల్‌ విలువను రూ. 14,000 కోట్లుగా లెక్కగట్టినట్లు పేర్కొన్నాయి. భారత ఇన్‌ఫ్రా రంగంపై, అలాగే వివిధ రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఎంఈఐఎల్‌పై అంతర్జాతీయ ఇన్వెస్టర్లకున్న ఆసక్తిని ఇది తెలియజేస్తోందని వివరించాయి. 

దీనితో రూ. 1 లక్ష కోట్ల వేల్యుయేషన్‌ దన్నుతో  ప్రైవేట్‌ నిర్వహణలో ఉన్న అత్యంత విలువైన ఇన్‌ఫ్రా, ఇంజనీరింగ్‌ గ్రూప్‌ల సరసన ఎంఈఐఎల్‌ కూడా నిల్చినట్లు పేర్కొన్నాయి. ‘ఎంఈఐఎల్‌ గ్రూప్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా భారత దీర్ఘకాలిక ఇన్‌ఫ్రా, వృద్ధి గాథలో పాలుపంచుకునేందుకు అవకాశం లభిస్తుందని గ్లోబల్‌ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. గ్రూప్‌ విజన్, వైవిధ్యమైన వ్యాపార పోర్ట్‌ఫోలియో, ప్రాజెక్టులను పూర్తి చేయగలిగే సామర్థ్యాలపై వారికి ఉన్న నమ్మకానికి ఈ పెట్టుబడులు నిదర్శనం‘ అని వివరించాయి.  

20 పైగా దేశాల్లో కార్యకలాపాలు.. 
ఎంఈఐఎల్‌ గత మూడు దశాబ్దాలుగా 20 పైగా దేశాల్లో విస్తరించింది. రవాణా, ఇంధనం, మౌలిక సదుపాయాలు, తయారీ తదితర రంగాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్టు, కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్, జోజిలా టనెల్, ముంబై కోస్టల్‌ రోడ్‌ వంటి ప్రాజెక్టులు గ్రూప్‌ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. దాదాపు 1,975 కి.మీ. రహదారుల పోర్ట్‌ఫోలియో ఉంది. ఇక ఇంధన రంగంలో హైడ్రోకార్బన్స్, విద్యుదుత్పత్తి, పునరుత్పాదక విద్యుత్, ఎనర్జీ స్టోరేజ్‌ మొదలైన విభాగాల్లో కార్యకలాపాలు ఉన్నాయి.

 9,110 మెగావాట్ల పంప్డ్‌ స్టోరే జీ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. అణు విద్యుత్‌ రంగానికి సంబంధించి కర్ణాటకలోని కైగాలో రెండు 700 మెగావాట్ల భారజల రియాక్టర్లను నిర్మిస్తోంది. అంతర్జాతీయంగా మంగోలియాలో ఆయిల్‌ రిఫైన రీని నిర్మిస్తోంది. అనుబంధ సంస్థల ద్వారా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, డ్రిల్లింగ్‌ టెక్నాలజీ, తయారీ, సిటీ గ్యాస్‌ డి్స్టిబ్యూషన్‌లాంటి విభాగాల్లోనూ కార్యకలాపాలు ఉన్నాయి. ఒలెక్ట్రా, ఈవీట్రాన్స్‌ సంస్థల ద్వారా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ విభాగంలో విస్తరించింది. మేఘా గ్యాస్‌ ద్వారా పలు రాష్ట్రాల్లో సిటీ గ్యాస్‌ పంపిణీ నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement