యూపీఐ వినియోగదారులకు ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు ముఖ్య గమనిక. నవంబర్ 19న (గురువారం) తెల్లవారుజామున 45 నిమిషాల పాటు యూపీఐ (UPI) సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్‌లో భాగంగా ఈ అంతరాయం ఏర్పడనుందని బ్యాంక్ వెల్లడించింది.
ఎస్‌బీఐ ప్రకటన ప్రకారం.. నవంబర్ 19న తెల్లవారుజామున 1:15 గంటల నుంచి 2:00 గంటల వరకు సాధారణ యూపీఐ సేవలు అందుబాటులో ఉండవు. అయితే నిర్వహణ పనులు ముందుగానే పూర్తయితే సేవలను నిర్ణీత సమయం కంటే ముందే పునరుద్ధరించే అవకాశం ఉంది.
ఈ సమయంలో ఎస్‌బీఐ ఖాతాలకు అనుసంధానమైన యూపీఐ చెల్లింపులు చేసేవారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్‌ల ద్వారా ఎస్‌బీఐ ఖాతాను ఉపయోగించి చేసే సాధారణ యూపీఐ లావాదేవీలపైనా ఈ ప్రభావం ఉండవచ్చు.
యూపీఐ లైట్‌తో చెల్లింపులు
సాధారణ యూపీఐ సేవలు నిలిచిపోయినప్పటికీ, యూపీఐ లైట్ (UPI Lite) సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. కాబట్టి ఈ సమయంలో చిన్న మొత్తాల చెల్లింపులు చేయాల్సిన వారు యూపీఐ లైట్‌ను ఉపయోగించుకోవచ్చు. అత్యవసర చెల్లింపులు చేయాల్సిన కస్టమర్లు ముందుగానే ఈ సదుపాయాన్ని యాక్టివేట్ చేసుకుని అవసరమైన మొత్తాన్ని అందులో లోడ్ చేసుకోవడం మంచిది.
Due to scheduled maintenance activity, SBI UPI services will be temporarily unavailable from 01:15 hrs to 02:00 hrs (IST) on 19.11.2026. The activity may, however, be completed early. Customers may continue to use UPI Lite Services for uninterrupted service. We regret the inconvenience caused to our customers.
— State Bank of India (@TheOfficialSBI) November 18, 2026


