వాట్సాప్‌లో బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌.. | Ujjivan Small Finance Bank WhatsApp Banking Open Savings Account | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌..

Nov 18 2026 3:05 PM | Updated on Nov 18 2026 3:35 PM

Ujjivan Small Finance Bank WhatsApp Banking Open Savings Account

దేశీ బ్యాంకింగ్‌ వ్యవస్థలోనే తొలిసారిగా వాట్సాప్‌ బ్యాంకింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ (ఎస్‌ఎఫ్‌బీ) వెల్లడించింది. 900 208 2121 వాట్సాప్‌ బ్యాంకింగ్‌ చానల్‌ ద్వారా సేవింగ్స్‌ అకౌంటును నేరుగా ప్రారంభించవచ్చని తెలిపింది.

మొబైల్, పాన్, కస్టమర్‌ సీకేవైసీ వెరిఫికేషన్‌ మొదలైనవి పూర్తి చేసి ఖాతాను తెరవొచ్చని వివరించింది. అలాగే 50కి పైగా సర్వీసులను పొందవచ్చని తెలిపింది. బ్యాలెన్స్‌ ఎంక్వైరీలు, ఇటీవలి లావాదేవీలు, డిపాజిట్‌ సర్వీసులు మొదలైనవి వీటిలో ఉన్నాయి. ప్రస్తుతం తమ సర్వీస్‌ రిక్వెస్టుల్లో 22 శాతం భాగం ఈ మాధ్యమం ద్వారానే ఉంటున్నాయని బ్యాంకు తెలిపింది.  

అకౌంట్‌ ఓపెన్‌ చేయండిలా..
ఈ సదుపాయం ద్వారా కొత్త కస్టమర్లు ప్రత్యేకంగా బ్యాంకింగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే వాట్సాప్‌లో ఖాతా ప్రారంభించవచ్చు. ఇందుకోసం ముందుగా 900 208 2121 నంబర్‌ను ఫోన్‌లో సేవ్‌ చేసుకుని వాట్సాప్‌లో 'Hi' అని మెసేజ్‌ పంపాలి. అనంతరం 'Open Savings Account' ఆప్షన్‌ను ఎంచుకుని మొబైల్‌, పాన్‌ నంబర్‌ ధ్రువీకరణ పూర్తి చేయాలి. సీకేవైసీ లేదా ఆధార్‌ వివరాల వెరిఫికేషన్‌ తర్వాత ఖాతా రకాన్ని ఎంపిక చేసుకుని, ప్రారంభ డిపాజిట్‌ చేసి వీడియో కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ధ్రువీకరణ పూర్తయిన తర్వాత ఖాతాను వినియోగించుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement