నవంబర్ నెలలో పలు పండుగలు నేపథ్యంలో.. బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. దీపావళి, ఛత్ పూజ, గురునానక్ జయంతి వంటి పండుగల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే.. ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. ఆయా ప్రాంతాల్లో జరుపుకునే పండుగలను బట్టి బ్యాంక్ హాలిడేస్ మారుతుంటాయి. అందువల్ల బ్యాంకు పనులపై బయటకు వెళ్లాలనుకునేవారు ముందుగానే సెలవుల వివరాలు తెలుసుకోవడం మంచిది.
ముఖ్యంగా బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేయడం, విత్‌డ్రా చేయడం, చెక్కుల క్లియరెన్స్ వంటి పనులు ఉన్నవారు సెలవుల జాబితాను తప్పకుండా.. ఒకసారి పరిశీలించాలి. లేదంటే బ్యాంకుకు వెళ్లిన తర్వాత బ్రాంచ్ మూసి ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
నవంబర్ 15: ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు
నవంబర్ 16: ఛత్ పూజ సందర్భంగా పాట్నా, రాంచీ నగరాల్లో బ్యాంకులు పనిచేయవు
నవంబర్ 20: ఇగాస్ బగ్వాల్ పండుగ కారణంగా డెహ్రాడూన్‌లో బ్యాంకులకు సెలవు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం బ్యాంకుల సెలవులు జాతీయ, ప్రాంతీయ పండుగలను బట్టి నిర్ణయిస్తారు. జాతీయ సెలవులు దేశవ్యాప్తంగా వర్తిస్తే, ప్రాంతీయ పండుగల సెలవులు మాత్రం ఆయా రాష్ట్రాలు, నగరాలకే పరిమితమవుతాయి. అందుకే.. ఒక రాష్ట్రంలో బ్యాంకులు పనిచేస్తున్న రోజున మరో రాష్ట్రంలో సెలవు ఉండవచ్చు. ఖాతాదారులు తమ బ్యాంకు బ్రాంచ్‌ను సందర్శించే ముందు సెలవుల వివరాలను అధికారికంగా నిర్ధారించుకోవడం మంచిది.
బ్యాంకులకు సెలవు ఉన్న రోజుల్లో బ్రాంచ్‌ల ద్వారా నిర్వహించే నగదు డిపాజిట్లు, విత్‌డ్రాలు, చెక్కుల క్లియరెన్స్ వంటి సేవలు అందుబాటులో ఉండవు. అయితే.. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు, ఏటీఎం వంటి డిజిటల్ సేవలను సాధారణంగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి బ్యాంకు పనులు ఉన్నవారు ముందుగానే ప్లాన్ చేసుకుంటే చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ఉండొచ్చు.
ఇదీ చదవండి: జెన్సన్ లేకపోతే ఎన్విడియా పరిస్థితి ఇదే..? మస్క్ హెచ్చరిక!


