బంగారం ధరలు.. వచ్చే ఏడాది ఇంకా తక్కువకు!! | Goldman Sachs Cuts 2027 Gold Price Forecast Fed Rate Hike Fears | Sakshi
Sakshi News home page

బంగారం ధరలు.. వచ్చే ఏడాది ఇంకా తక్కువకు!!

Nov 14 2026 9:41 PM | Updated on Nov 14 2026 9:50 PM

Goldman Sachs Cuts 2027 Gold Price Forecast Fed Rate Hike Fears

బంగారం ధరలు..  అంతర్జాతీయంగా వచ్చే ఏడాది ఇంకా తగ్గుతాయన్న అంచనాలు బలపడుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్‌) వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశాల నేపథ్యంలో అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్‌ బంగారం ధరల అంచనాను తగ్గించింది. 2027 డిసెంబర్‌ నాటికి ఔన్స్‌ (31.1 గ్రాములు) బంగారం ధర 4,800 డాలర్లకు చేరుతుందని గతంలో అంచనా వేయగా.. తాజాగా దాన్ని 4,650 డాలర్లకు పరిమితం చేసింది. అంటే గత అంచనాతో పోలిస్తే 150 డాలర్లు (3.1 శాతం) తగ్గించింది. అయితే ప్రస్తుత స్పాట్‌ ధరలతో పోలిస్తే 2027 చివరికి బంగారంలో ఇంకా 16 శాతం వృద్ధికి అవకాశముందని సంస్థ భావిస్తోంది.

వడ్డీ రేట్ల పెంపుతో ఒత్తిడి

ఫెడ్‌ 2026 డిసెంబర్‌లో మరోసారి 25 బేసిస్‌ పాయింట్లు, 2027 మార్చిలో ఇంకో 25 బేసిస్‌ పాయింట్లు వడ్డీ రేట్లను పెంచవచ్చని గోల్డ్‌మన్ సాచ్స్‌ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లు పెరిగితే బంగారం వంటి వడ్డీ ఆదాయం ఇవ్వని పెట్టుబడులపై ఆసక్తి తగ్గుతుంది. ఫలితంగా ప్రైవేటు పెట్టుబడిదారుల నుంచి డిమాండ్‌ బలహీనపడే అవకాశం ఉంది. ముఖ్యంగా 2027 తొలి నెలల్లో బంగారం ధరలకు ఇది ప్రతికూలంగా మారవచ్చని సంస్థ పేర్కొంది.

కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతో మద్దతు

స్వల్పకాలంలో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో బంగారంపై గోల్డ్‌మన్ సాచ్స్‌ సానుకూలంగానే ఉంది. చైనా సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం కొనసాగిస్తుండటం ధరలకు మద్దతునిస్తుందని అంచనా వేస్తోంది. మరోవైపు 2027 చివర్లో అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల తగ్గింపును ప్రారంభిస్తే ప్రైవేటు పెట్టుబడిదారులు మళ్లీ బంగారం వైపు మళ్లే అవకాశముందని భావిస్తోంది. దీంతో పెట్టుబడి డిమాండ్‌ పుంజుకుని ధరలు ఔన్స్‌కు 4,650 డాలర్ల స్థాయికి చేరవచ్చని అంచనా వేసింది.

దేశంలోని ‍ప్రధాన నగరాలలో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూడొచ్చు..

gold1
1/6

gold2
2/6

gold3
3/6

gold4
4/6

silver5
5/6

silver6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement