సైబర్ నేరాలపై బ్యాంక్ ఆఫ్ బరోడా అవగాహన | Bank of Baroda Cyber Crime Awareness Programme Vijayawada | Sakshi
Sakshi News home page

సైబర్ నేరాలపై బ్యాంక్ ఆఫ్ బరోడా అవగాహన

Nov 18 2026 9:38 PM | Updated on Nov 18 2026 9:41 PM

Bank of Baroda Cyber Crime Awareness Programme Vijayawada

సైబర్ ముప్పులు, డిజిటల్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో సురక్షిత బ్యాంకింగ్ విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో  విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య వారి కళాక్షేత్రంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా హైదరాబాద్ జోన్ జనరల్ మేనేజర్ & జోనల్ హెడ్ ఎం.వి.ఎస్. సుధాకర్, హైదరాబాద్ జోన్ బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్. మురళీకృష్ణ, విజయవాడ రీజియన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ & రీజినల్ హెడ్  కె. కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఏపీ సీఐడీ అధికారి అధిరాజ్ సింగ్ రాణా, సైబర్ క్రైమ్స్ విజయవాడ డీసీపీ కె. కృష్ణ ప్రసన్న విచ్చేశారు.

ఈ సందర్భంగా వారు పెరుగుతున్న సైబర్ ముప్పులు, సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న వివిధ మోసపూరిత విధానాలు, సైబర్ నేరాల నివారణలో ప్రజల్లో అవగాహన ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో వివిధ బ్యాంకులకు చెందిన బ్యాంకర్లు, ఖాతాదారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement